సూర్య సినిమాలో టాలీవుడ్ లక్కీ హీరోయిన్?

తమిళనాట సూర్య హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. సింగం సీరీస్ తో యాక్షన్ హిట్స్ కొట్టిన సూర్య తర్వాత వరస [more]

Update: 2020-03-31 05:43 GMT

తమిళనాట సూర్య హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. సింగం సీరీస్ తో యాక్షన్ హిట్స్ కొట్టిన సూర్య తర్వాత వరస పరాజయాలతో సతమతయ్యాడు. అయితే తాజాగా యాక్షన్ డైరెక్టర్ తనకి హిట్స్ ఇచ్చిన హరితో సూర్య ఓ సినిమా చెయ్యబోతున్నాడు. మళ్ళీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కబోయే ఈసినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. అరవా టైటిల్ తో సూర్య – హరి సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే సూర్య సింగం సీరీస్ లో హరి అనుష్కనే హీరోయిన్ గా ఎంచుకున్నాడు. కానీ తాజాగా అనుష్క ని మార్చేశారు ఈ హీరో – డైరెక్టర్ ఇద్దరూ అంటున్నారు.

టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గత రెండేళ్లుగా స్టార్ హీరోలందరికీ లక్కీ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గర్లో ఉంది. అలాంటి హీరోయిన్ అయితే సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది అని సూర్య హరి భావిస్తున్నారట. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ – అఖిల్ సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే కి తెలుగులో మరో సినిమా లేదు. ఇక ఇప్పటివరకు తమిళనాట కూడా పూజ నటించలేదు. ఇక సూర్య సినిమాలో ఒకే అయితే పూజ హెగ్డే గ్రాండ్ గా తమిళ ఎంట్రీ ఇచ్చిఅంట్టే. హరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకై మంచి ప్రాధాన్యత ఉంటుంది. మరి పూజ ఓకె అంటే తమిళంలోనూ పూజ స్టార్ హీరోలందరిని ఓ చూపు చూసి కానీ వదలదులే అంటున్నారు.

Tags:    

Similar News