లిప్ లాక్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. కానీ మాకే

సినిమాల్లో కథ డిమాండ్ ని బట్టి.. దర్శకులు హీరో హీరోయిన్స్ కి లిప్ లాక్ సన్నివేశాలు పెడతారు. లిప్ లాక్ కిస్సులున్నాయి అంటే.. యూత్ ఎగబడడం ఖాయం…. [more]

Update: 2019-12-28 07:07 GMT

సినిమాల్లో కథ డిమాండ్ ని బట్టి.. దర్శకులు హీరో హీరోయిన్స్ కి లిప్ లాక్ సన్నివేశాలు పెడతారు. లిప్ లాక్ కిస్సులున్నాయి అంటే.. యూత్ ఎగబడడం ఖాయం…. అనేది ఈమధ్యన చాల సినిమాలు ప్రూవ్ చేసాయి. అసలు మహేష్ బాబు చేసే సినిమాల్లో లిప్ లాక్స్ ఎక్కువగా కనబడతాయి. ఆ లిప్ లాక్స్ చూసి నిజంగానే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అది తెరకేకించేటప్పుడు హీరో హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడతారనే విషయం చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఇప్పుడు అదే విషయాన్నీ టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరలో ఉన్న పూజ హెగ్డే చెబుతుంది. ఓ ఇంగ్లిష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పూజ హెగ్డే ఈ లిప్ లాక్స్ సన్నివేశాల వలన తామెంత ఇబ్బంది పడతామో చెప్పుకొచ్చింది. అలాగే ఆ ముద్దు సీన్ లో నటించేందుకు తాను ఫేస్ చేసిన ఓ సంఘటనలు కూడా వివరించింది.

మేము ముద్దు సీన్స్ లో కనబడగానే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.. కానీ మేము ఆ సీన్ లో నటించడానికి పడే కష్టం ప్రేక్షకులకు తెలియదు. ఓసారి బాలీవుడ్ లో మోహింజదారో సినిమా షూటింగ్ సమయంలో హ్రితిక్ రోషన్ కి నాకు లిప్ లాక్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది.. ఆ సన్నివేశం కోసం దర్శకుడు అశుతోష్… నన్ను ప్రిపేర్ చేస్తున్నారు. నేను లిప్ లాక్ సీన్ చెయ్యడానికి రెడీ అయ్యా. కానీ నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎందుకంటే అదివరకు నేను అలాంటి సన్నివేశాలు చేసింది లేదు.. మేము ఆ సీన్ చేసేటప్పుడు సినిమా టీం మొత్తం అక్కడే ఉంది.. అప్పుడు ఆ సీన్ లో నటించడం నాకు చాలా కష్టంగా అనిపిచింది అని.. ఆ సీన్ చేసేటప్పుడు ఎంత కష్టమో అందరికి వివరిస్తుంది పూజ హెగ్డే. అయితే కొన్నిసార్లు కెమెరా మాయాజాలంతో లిప్ లాక్స్ చెయ్యకుండానే చేసినట్టుగా కవర్ అవుతుందని చెపుతుంది పూజ.

Tags:    

Similar News