పూజ హెగ్డే కి ఎలాంటి అబ్బాయి కావాలంటే

పూజ హెగ్డే ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతున్న నెంబర్ వన్ హీరోయిన్. పూజ తో పోటీ పడుతున్న రశ్మిక సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అయితే [more]

Update: 2019-12-15 06:31 GMT

పూజ హెగ్డే ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతున్న నెంబర్ వన్ హీరోయిన్. పూజ తో పోటీ పడుతున్న రశ్మిక సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అయితే గనక పూజ ని తట్టుకుని నిలబడగలుగుతుంది. ఆ సినిమా అటు ఇటు అయితే మల్లీ పూజానే టాప్. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్, అఖిల్ అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దగుమ్మకి ఎలాంటి అబ్బాయి కావాలో చెబుతుంది. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఇప్పుడే లేదనుకోండి.. కానీ పూజ కి ఇష్టమైన రెండు పనులు చేస్తే ఇట్టే పడిపోతుందట. చాలామంది అమ్మాయిలను ఇంప్రెస్స్ చెయ్యడానికి నానా కష్టాలు పడుతుంటారు.

కానీ పూజ లాంటి అమ్మాయిని పదెయ్యాలంటే మంచి ఫుడ్ పెట్టడమో లేదా కాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకువెళ్తే చాలు పూజ హెగ్డే పడిపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పూజ హెగ్డే తనని పదెయ్యాలంటే ఫుడ్ లేదా కాండిల్ లైట్ డిన్నర్‌ కి తీసుకెళ్తే చాలని.. తాను మంచి ఫుడ్ లవర్ అని, మంచి ఫుడ్ అంటే.. నాకిష్టమైన ఫుడ్ పెడితే చాలని ఈజీగా పడిపోతా అని, ఒకవేళ ఫుడ్ తో ఇంప్రెస్ చెయ్యలేకపోతే.. ఏ కాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకువెళ్తే చాలు తొందరగా పడిపోతాని, ఇంకా వినయం, ఇంటెలిజెంట్ ఉన్న అబ్బాయిలంటే ఇష్టమని చెబుతుంది. మరి పూజ హెగ్డే కెరీర్ ఊపులో ఉండగానే పెళ్లి ముచ్చట చెబుతుందా ఏమిటి. లేదంటే ఇప్పుడు తనకి ఇష్టమైనవి చేస్తే చాలు అబ్బాయిలకు పడిపోతా అంటూ చెప్పుకొస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News