నో… అయినా ఇదేం ప్రశ్న అంటున్న పూజ

బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ హీరోలతో దున్నుడే దున్నుదు. హిట్ అనే పదంతో సంబంధమే లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుపోతున్న పూజ హెగ్డే కి ఎట్టకేలకు బాలీవుడ్ [more]

Update: 2020-01-03 05:24 GMT

బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ హీరోలతో దున్నుడే దున్నుదు. హిట్ అనే పదంతో సంబంధమే లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుపోతున్న పూజ హెగ్డే కి ఎట్టకేలకు బాలీవుడ్ లోను హౌస్ ఫుల్ 4 తో హిట్ అందుకుంది. యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగొట్టింది హౌస్ ఫుల్ 4. ఇక తెలుగులో అల్లు అర్జున్ తోనూ, ప్రభాస్ తోనూ, అఖిల్ తోనూ సినిమాలు చేస్తున్న పూజ తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల్తో చిట్ చాట్ చేసింది. మరి సోషల్ మీడియాలో లైవ్ అంటే.. నెటిజెన్స్ ఎలా ఉంటారో.. ఎలాంటి పశ్నలడుగుతారో తెలిసిందే. అయితే ఓ అభిమాని పూజని ఓ షాకింగ్ విషయమడిగాడు.

అదేమిటంటే జాన్ సినిమాలో ప్రభాస్ తో కలసి నటిస్తున్నారు కదా.. ఇంకా పెళ్లి చేసుకోని ప్రభాస్ గనక మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారని అడగ్గానే.. ఏం చెప్పాలో తెలియక నోరు తెరిచిన పూజ హెగ్డే వెంటనే సర్దుకుని.. నో ఇదేం ప్రశ్న. అసలు ప్రభాస్ నాకెందుకు ప్రపోజ్ చేస్తారు. ఒకవేళ ప్రభాస్ ప్రపోజ్ చేస్తే అనే ప్రశ్నకు లాంగ్ స్టోరీ ఉంటుంది. నో నేనైతే దీనికి సమాధానం చెప్పలేను అంటూ తప్పించుకుంది. మరి ప్రభాస్ పేరు చెప్పగానే బాగా సిగ్గుపడిన పూజ ని మరో అభిమాని మహేష్ తో కలిసి మరోసారి నటిస్తారా అని అడగగా… మహర్షి షూటింగ్ సమయంలో మహేష్ తో కలిసి పని చెయ్యడం నచ్చింది. .. మల్లి ఫ్యూచర్ లో మేము కలిసి పని చేస్తామని ఆశిస్తున్నా అనేసింది

Tags:    

Similar News