పూజ మరీ ఇంత బిజీనా..!

Update: 2018-10-03 08:00 GMT

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ ఛైర్ కి చేరువలో ఉన్న పూజ హెగ్డే మహేష్ మహర్షి షూటింగ్ లో, బాలీవుడ్ లో మరో సినిమా షూటింగ్స్ తో బిజీగా వుంది. అందుకే పూజ హెగ్డే గత రాత్రి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తుంది పూజ హెగ్డే. అంటే సినిమాకి ముఖ్యమైన కీ రోల్ అన్నమాట, అందుకే టైటిల్ కూడా అరవింద సమేత అని పెట్టారు. అరవింద షూటింగ్ కంప్లీట్ కావడంతో.. పూజ తన షెడ్యూల్ ని మహర్షి తదుపరి ఇటలీ షెడ్యూల్ కోసం, బాలీవుడ్ లో నటిస్తున్న మరో సినిమా కోసం కేటాయించింది. మరి ఒకే ఒక్క సినిమాతో ఒక్కసారిగా బిజీ అయిన పూజ ఇప్పుడు అరవింద సమేత ప్రమోషన్స్ లో పాల్గొనాలన్నా.. బిజీ షెడ్యూల్ అడ్డురావడంతోనే నిన్న జరిగిన ప్రై రిలీజ్ ఈవెంట్ కి హాజరవలేకపోయింది. ప్రభాస్ తో జిల్ రాధాకృష్ణ సినిమాలోనూ నటించాల్సి ఉంది. ఆ సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో పట్టాలెక్కేందుకు సిద్ధంగా వుంది.

స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నా...

ఇక అరవింద సమేత హిట్ అయ్యిందా.. పూజకి తిరుగుండదు. ఎందుకంటే ఇప్పటివరకు పూజ చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ యావరేజ్ సినిమాలే. ఇకపోతే అరవింద సమేత కోసం పూజ హెగ్డే తన గొంతు కూడా సవరించింది. అరవింద పాత్రకు పూజ హెగ్డేనే డబ్బింగ్ చెప్పుకుంది. మరి అరవింద ట్రైలర్ లో కాస్త మైనస్ ఏదైనా ఉంది అంటే.. పూజ హెగ్డే వాయిస్ అంటున్నారు. మరి త్రివిక్రమ్ తన హీరోయిన్స్ తో ఓన్ గా డబ్బింగ్ చెప్పించినట్టుగానే.. దీనిలోనూ పూజ తో డబ్బింగ్ చెప్పించాడు. మరి ట్రైలర్ లో పూజ వాయిస్ అంతగా మ్యాచ్ కాలేదు. చూద్దాం 11 న థియేటర్స్ లో పూజ నటనతో పాటు వాయిస్ ఎలా వుండబోతుందో అనేది.

Similar News