ఆలోచిస్తా అంటుంది.. ఒప్పేసుకుంటుంది

వరస సినిమాల్తో ఉక్కిరిబిక్కిరవుతున్న పూజ హెగ్డే ఇప్పుడు టాప్ చైర్ లో కూర్చున్న ఏకైక హీరోయిన్. చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా.. స్టార్ హీరోలను వేళ్ళమీద [more]

Update: 2019-12-09 06:22 GMT

వరస సినిమాల్తో ఉక్కిరిబిక్కిరవుతున్న పూజ హెగ్డే ఇప్పుడు టాప్ చైర్ లో కూర్చున్న ఏకైక హీరోయిన్. చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా.. స్టార్ హీరోలను వేళ్ళమీద ఆడిస్తున్న హీరోయిన్ పూజ. అయితే ప్రస్తుతం వరసగా సినిమాలు ఒప్పుకోకుండా. కథ బలం ఉన్న సినిమాలకి ఓకె చెబుదామనుకుంటుందట పూజ. అదే విషయాన్నీ తనదగ్గరకొచ్చిన దర్శకనిర్మాతలకు సున్నితంగా చెప్పేస్తుందట. అయితే తాజాగా పూజ హెగ్డే కి బాలీవుడ్ నిండి అవకాశాలు వస్తున్నాయని, కానీ తెలుగులో ప్రభాస్, అఖిల్ సరసన నటిస్తున్న పూజ కి అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో సినిమా పూర్తయ్యింది. అయితే బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 పోయినా… పూజ కి మాత్రం అక్కడ భారీ అవకాశాలొస్తున్నాయట.

అయితే జాన్, కి అఖిల్ సినిమాకి డేట్స్ బ్లాక్ చేసుకున్న పూజ తో… ప్రభాస్ బాలీవుడ్ అవకాశాలు పోగొట్టుకోవద్దు అని చెప్పడంతో.. పూజ హెగ్డే ధైర్యంగా బాలీవుడ్ సినిమాలు సైన్ చెయ్యడానికి రెడీ అవుతుందట. జాన్ దర్శకుడు రాధాకృష్ణ జాన్ కి బ్రేక్ ఇవ్వడం ప్రభాస్ కూడా వెకేషన్స్ కి వెళ్లడంతో పూజ కి కాస్త ఫ్రీ అవడము, పూజ బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తే ఆ క్రేజ్ జాన్ కి వస్తుంది కాబట్టే ప్రభాస్ అండ్ నిర్మాతలు పూజ కి బాలీవుడ్ అవకాశాలు ఎంకరేజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది

Tags:    

Similar News