టాలీవుడ్ ఓకె.. బట్ బాలీవుడ్డే ముద్దు!!

ఇలా హీరోయిన్స్ చాలామందే అనుకుంటారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ అయినప్పటికీ.. చాలామందికి బాలీవుడ్ మీద మోజు మాత్రం చావదు. ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు బాలీవుడ్ [more]

Update: 2020-09-14 05:13 GMT

ఇలా హీరోయిన్స్ చాలామందే అనుకుంటారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ అయినప్పటికీ.. చాలామందికి బాలీవుడ్ మీద మోజు మాత్రం చావదు. ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు బాలీవుడ్ చెక్కేద్దామా? అని ఎదురు చూస్తుంటారు. అలా సౌత్ నుండి కాజల్, త్రిష, తమన్నా, రకుల్ , ఇలియానా, తాప్సి లాంటివాళ్ళు బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కి అక్కడ సెటిల వ్వాలనుకుంటే అందులో తాప్సి లాంటి హీరోయిన్స్ ఐ మాత్రం బాలీవుడ్ లో ఆఫర్స్ దక్కుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ నెంబర్ వన్ పోజిషన్ లో ఉన్న పూజ హెగ్డే కూడా టాలీవుడ్ లో నెంబర్ వన్ అయినా.. బాలీవుడ్ లో ఏ ఒక్క అవకాశాన్ని వదలను అంటుంది.

బాలీవుడ్ లో సక్సెస్ కాలేక టాలీవుడ్ కి వచ్చేసి ఇక్కడ టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్దే మధ్యమధ్యలో బాలీవడో అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. గత ఏడాది హౌస్ ఫుల్ 4 లో నటించి సక్సెస్ సాధించడమేనా.. అక్షయ్ కుమర్ తో మరో సినిమా సల్మాన్ ఖాన్ సినిమాలో పూజ నటించబోతుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్‌ చేయడానికి కమిటైనట్టు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో పూజ హెగ్దే ఒకే ఒక్క ఎపిసోడ్‌లో నటించనుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ టాప్ చైర్ లో ఉన్న పూజ బాలీవడో లో వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు అంటే.. బాలీవుడ్ అవకాశాలే పూజ ఫైనల్ టార్గెట్ లా అనిపించడం లేదూ.

Tags:    

Similar News