అయ్యే… మ‌ళ్లీ మిస్ అయ్యిందే..!

టాప్ రేంజ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న పూజ హెగ్డే కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేకపోతుంది. గత ఏడాది అరవింద సమేతలో [more]

Update: 2019-05-10 06:26 GMT

టాప్ రేంజ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న పూజ హెగ్డే కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా అందుకోలేకపోతుంది. గత ఏడాది అరవింద సమేతలో టైటిల్ రోల్ పోషించినా పూజ హెగ్డేకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ సినిమా హిట్ ని ఎన్టీఆర్ జేబులో వేసుకున్నాడు. పూజ హెగ్డేకి ఆ బ్లాక్ బస్టర్ అనే పదం అందని ద్రాక్షలాగే మిగిలిపోయేలా కనబడుతుంది. గత ఏడాది ఎన్టీఆర్ తో అరవిందలో నటిస్తే అది ఓ అన్నంత హిట్ కాలేదు. ఇక ఈ ఏడాది మహేష్ ని నమ్ముకుంది. మహేష్ తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాలో పూజ హెగ్డే పాత్రని కీలకంగా చూపించలేకపోయాడు వంశీ పైడిపల్లి. పూజని గ్లామర్ డాల్ లాగే చూసినట్లుగా కనబడుతుంది. పూజ హెగ్డే తన వరకు తాను అందంగానే కనబడింది. ఇక మహేష్ తో సాంగ్స్ లోనూ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గలేదు.

మ‌హ‌ర్షిపై ఆశ‌లు పెట్టుకున్నా…

కానీ సినిమాలో పూజ పాత్రే ఓ అన్నంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు. పూజ హెగ్డే నటనకు అంత అవకాశం లేదు. అందుకే హీరోయిన్ పూజ హెగ్డే గురించి అంత ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు అన్నట్లుగా క్రిటిక్స్ పెదవి విరుపులు. మొదటి నుండి అంటే మహర్షి ట్రైలర్ లోనే పూజ హెగ్డే కేవలం గ్లామర్ డాల్ పాత్ర తప్ప నటనకు ఆస్కారం ఉండదని అన్నారు. అన్నట్లుగానే పూజ హెగ్డేని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. మహేష్ – పూజ హెగ్డేలకు మంచి రొమాంటిక్ లవ్ ట్రాక్ పెట్టలేదు. మరి డీజే, అరవింద సమేత లాంటి పెద్ద సినిమాల్లో పూజ పరిస్థితి ఎలా ఉందో.. తాజాగా మహర్షిలోనూ పూజ అలానే ఉంది. మరి ఈ మహర్షి మూవీతో కూడా పూజ కోరిక తీరకుండా పోయిందనే చెప్పాలి. మహర్షికి యావరేజ్ టాక్ పడడం కూడా పూజ హెగ్డేకి మింగుడు పడని విషయమే.

Tags:    

Similar News