ఆ సాంగ్ హిట్ కి కారణం చెప్పిన జిగేలు రాణి..!

Update: 2018-10-23 06:08 GMT

డీజే దువ్వాడ జగన్నాధం సినిమా హరీష్ శంకర్ కి, అల్లు అర్జున్ కి మంచి చెయ్యకపోయినా అందులో నటించిన పూజ హెగ్డేకి మాత్రం చాలా మంచి చేసిందనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసిన పూజకి అదే టైంలో రామ్ చరణ్ రంగస్థలం లోనూ ఐటెం సాంగ్ కి సై అంది. అయితే స్టార్ హీరోల సరసన ఛాన్స్ ల మధ్యలో ఐటమ్స్ అవసరమా అంటూ చాలామంది దీర్ఘాలు తీశారు. పూజ హెగ్డే మాత్రం రామ్ చరణ్ రంగస్థలంలో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఆడి పాడి అదరగొట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక అలాగే పూజ ఐటెం సాంగ్ లోని గ్లామర్ కి మంచి పేరొచ్చింది.

తనకూ మంచి పేరొచ్చింది...

మార్చ్ లో విడుదలైన రంగస్థలంలోని ఐటెం సాంగ్ గురించి.. ఆ పాట సూపర్ హిట్ అవడానికి గల కారణం ఇప్పుడు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పూజ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అరవింద సమేత హిట్ తో దూసుకుపోతున్న పూజ హెగ్డే రీసెంట్ గా అరవింద సమేత ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇకపోతే రంగస్థలంలోని జిల్ జిల్ జిగేలు రాణి పాట హిట్ అవడానికి అసలు కారణం ఏమిటంటే... ఆ పాట‌ను ఛాలెంజ్ గా తీసుకోవ‌ట‌మేన‌ని చెబుతుంది పూజ. జిగేలు రాణి పాటలోని త‌న డాన్స్, ఎక్స్ ప్రెష‌న్స్ బాగా న‌చ్చ‌టంతో తనకి కూడా మంచి పేరు వ‌చ్చిందని.. ఆ పాట‌లో బాగా డాన్స్ చేయ‌టానికి కార‌ణం.. త‌న బ్యాక్ గ్రౌండేన‌ని చెప్పింది.

సంగీతంపై ఇష్టంతోనే...

తనకు సంగీతంతో పాటు డాన్స్ అన్నా బోలెడంత ఇష్టమని.. తనకు పదేళ్లున్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్న‌న‌ట్లు చెప్పింది. తాను ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కూ సంగీతాన్ని వింటూనే ఉండేద‌ట‌. ఇలా డాన్స్, సంగీతంలో ఉన్న ఇష్టంతోనే జిగేలు రాణి పాటకు బాగా కనెక్ట్ అవడం.. ఆ పాటలో తన ప్రావీణ్యతను ఉంచబట్టే ఆ పాట అంత హిట్ అయ్యిందని చెబుతుంది ఈ అరవింద.

Similar News