చీరకట్టులో ఉన్న కష్టం వర్ణనాతీతం అంటున్న హీరోయిన్?

హీరోయిన్స్ బుల్లి ఫ్రాక్స్ వేసినా.. చిన్న చిన్న మిడ్డీస్ వేసినా, లేదంటే జీన్స్ ప్యాంట్స్ వేసినా రాని అందం చీర కట్టగానే ఓ అందమైన గ్లామర్ లుక్ [more]

Update: 2020-02-26 06:57 GMT

హీరోయిన్స్ బుల్లి ఫ్రాక్స్ వేసినా.. చిన్న చిన్న మిడ్డీస్ వేసినా, లేదంటే జీన్స్ ప్యాంట్స్ వేసినా రాని అందం చీర కట్టగానే ఓ అందమైన గ్లామర్ లుక్ అయితే కనబడుతుంది. అయితే చాలామంది హీరోయిన్స్ చీరలు కడితే పెద్ద అమ్మాయిలా అంటే ఆంటీస్ ల కనబడతామని.. ఎక్కువగా గ్లామర్ కోసం ఫ్రాక్స్, మిడ్డీస్, షార్ట్స్ నే ఎంచుకుంటారు. చీర కట్టులో ఎంత అందమున్న చీర అనేసరికి హీరోయిన్స్ కి భయం పట్టుకున్నట్టే.. పూజ హేగ్డ్ కి కూడా చీర అంటే భయమట. ప్రస్తుతం గ్లామర్ భామగా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతున్న పూజ హెగ్డే కి చిన్నప్పటినుండి ఇప్పటివరకు చీర అనగానే కాళ్ళు వణుకుతాయట.

హై స్కూల్ ఏజ్ లోనే పూజ హెగ్డే చీర కట్టుకుని స్కూల్ ఫంక్షన్ కి వెళ్లిందట. అప్పట్లోనే చీర కట్టులో ఎంతో అందంగా ఉందట. కానీ చీర కట్టుకోగానే అది ఎక్కడ జారిపోతుందో అనే భయంతో పూజ హెగ్డే ఒణికిపోయిందట. టీచర్స్ అంతా నా చీర ని నేను కట్టుకున్న విధానాన్ని పోగిడారు. అది మా అమ్మ చీర. అయిన ఎందుకో అది జారిపోతుంది అని భయమేసింది. ఇక ఇప్పటికి సినిమాల్లో చీర కట్టు అనగానే భయమేస్తుంది అని చెబుతుంది. కానీ ఇంట్లో పూజ లు, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు చీర కట్టుకుంటా అని.. కానీ పని అవ్వగానే మాములు డ్రెస్ లోకి మారిపోతా అని చెబుతుంది. ఇక పార్టీలకు చీర జాన్తా నై.. ఓన్లీ పార్టీ వేర్ అంటూ చీర కట్టు కష్టాలను ఏకరువు పెడుతుంది పూజ.

Tags:    

Similar News