ప్రభాస్ ను ఆకాశానికెత్తిన పూజా

Update: 2018-10-24 07:43 GMT

'బాహుబలి' సిరీస్ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. నిన్న ఈ చిత్రం మేకింగ్ వీడియో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడని.. మేకింగ్ వాల్యూస్ చాలా బాగున్నాయని.. యాక్షన్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా తరువాత ప్రభాస్.. రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది.

ప్రభాస్ పై ప్రశంసలజల్లు

ఈ సందర్భంగా ఆమె ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ నాకు ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని చెప్పింది. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని.. చాలా మంచి మనిషి అని.. దయాగుణం ఎక్కువని పూజా తెలిపింది. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉందని పూజా స్పష్టం చేసింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగులో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ అవ్వబోతుంది.

Similar News