అది చూపించే గా టాప్ ప్లేస్ కొచ్చావ్!!

ముకుంద, ఒక లైలా కోసం లాంటి ట్రెడిషనల్ మూవీస్ చేసినా రాని క్రేజ్… డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో బికినీ వేసి, నడుము చూపిస్తూ హాట్ హాట్ [more]

Update: 2020-11-07 08:55 GMT

ముకుంద, ఒక లైలా కోసం లాంటి ట్రెడిషనల్ మూవీస్ చేసినా రాని క్రేజ్… డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో బికినీ వేసి, నడుము చూపిస్తూ హాట్ హాట్ గా గ్లామర్ షో చెయ్యగానే.. ఒక్కసారిగా టాప్ హీరోలతో ఛాన్సులు పట్టేసింది పూజ హెగ్డే. అప్ప్పటినుండి ఇప్పటివరకు గ్లామర్ పాత్రలను పట్టేసి మరో హీరోయిన్ కి స్పేస్ ఇవ్వకుండా దూసుకుపోతున్న పూజ హెగ్డే కి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఛాన్సెస్ కూడా వచ్చేస్తున్నాయ్. మోహింజదారో దెబ్బకి బాలీవడ్ కి బై బై చెప్పిన పూజ హెగ్డే మళ్ళీ చాలా ఏళ్ళకి హౌస్ ఫుల్ 4 లో నటించి హిట్ కొట్టింది . తర్వాత అక్షయ్ కుమర్ తో ఛాన్స్ తగలడమే కాదు… తాజాగా టాప్ స్టార్ రన్వీర్ సింగ్ తో సర్కార్ సినిమాలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఛాన్స్ పట్టేసింది.

మరి బాలీవుడ్ లో క్రేజ్ వచ్చేస్తుంది…. మనం సౌత్ విషయంలో ఎలా అంటే ఏమవుతుంది అనుకుందేమో అందుకే సౌత్ సినిమాలో ఎలాంటివి ఉంటే సౌత్ ప్రేక్షకులకు నచ్చుతాయో.. ఓపెన్ గా చెప్పేస్తుంది. సౌత్ ప్రేక్షకులే తనని టాప్ పొజిషన్ లో నిలబెట్టేరనే విషయం మరిచిపోయిందో.. సౌత్ తో అవసరం తీరిపోయింది అనుకుందో కానీ.. తాజాగా పూజ హెగ్డే సౌత్ మీద చేసిన వ్యాఖ్యలతో సౌత్ అభిమానులు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజ హెగ్డే ఓ ఇంటర్వ్యూ లో సౌత్ సినిమాలను, ప్రేక్షకులను పొగుడుతూనే.. సౌత్ ఇండియ‌న్ సినిమా వాళ్లు, అభిమానులు ఎక్కువగా న‌డుము మ‌త్తులోనే ఉంటార‌ని… గ్లామర్ డ్రెస్సులలోనే చూడడానికి అంటే హాట్ గా కనిపిస్తేనే ఆదరిస్తారంటూ పూజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.

మరి తెలుగు సినిమాల్లో గ్లామర్ షో చేస్తేనే క్రేజ్ వచ్చింది అనేది బహిర్గతమే. మరి పూజ గ్లామర్ షో చెయ్యను అంటే దర్శకులు ఆమె వెంట పడేవారు కాదు.. పూజ హెగ్డే ఇలా టాప్ పొజిషన్ లోను ఉండేది కాదు… గ్లామర్ చూపించింది.. ఆఫర్స్ పట్టేసింది. మరి అంత జరిగాక తన నడుము చూసి ఆఫర్స్ వచ్చాయి.. నడుము మత్తులోనే అభిమానులు ఉంటారంటే.. ఎలా చెప్పమ్మా పూజమ్మ..

Tags:    

Similar News