పెట, విశ్వాసం లో ఏది పైచేయి అంటే…

ఈ సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్టీఆర్ కథానాయుడుకు జనవరి 9 న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, రజిని [more]

Update: 2019-01-13 07:46 GMT

ఈ సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్టీఆర్ కథానాయుడుకు జనవరి 9 న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, రజిని పేట సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ నెగిటివ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక నిన్న వచ్చిన ‘ఎఫ్-2’ సినిమా నవ్వుల సంక్రాంతిగా మార్చేసింది. వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ కడుపు చెక్కలు అయ్యేలా నవ్వించారు. అన్ని చోట్ల ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

తమిళంలో కూడా ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రజిని పెట తో పాటు అజిత్ ‘విశ్వాసం’ కూడా రిలీజ్ అయింది. ఈరెండు సినిమాలు మాస్ ప్రేక్షకులని ద్రుష్టి లో పెట్టుకుని తీసినవే. అయితే పెట మాత్రం మాస్ తో పాటు క్లాస్ టచ్ కూడా ఉండడంతో స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక అజిత్ సినిమా ఊర మాస్ సినిమా అన్న టాక్ వచ్చింది. కానీ రెండు సినిమాల్లోకి కొత్తదనం ఏమి లేదు.

వసూల్ విషయంలో కూడా రెండూ గట్టి పోటీపడుతున్నాయి. రెండు చిత్రాలు హౌస్ ఫుల్స్‌ తో రన్ అవుతున్నాయి. పండగా సెలవల్లో కూడా ఈసినిమాకు ప్లస్ కానుంది. ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనేది కొన్ని రోజులు ఆగితే కానీ చెప్పలేం. ప్రస్తుతానికి అయితే టాక్ పరంగా రజనీ సినిమా ‘పేట’కు కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది.

Tags:    

Similar News