RX 100 భామ బరువు తగ్గడం వెనుక రహస్యం?

RX 100 లో బోల్డ్ గా నటించిన నాటినుంచి ఆఫర్స్ పట్టేసిన పాయల్ రాజపుట్.. స్టార్ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. కానీ స్టార్ హీరోలెవరు పాయల్ [more]

Update: 2020-10-25 03:24 GMT

RX 100 లో బోల్డ్ గా నటించిన నాటినుంచి ఆఫర్స్ పట్టేసిన పాయల్ రాజపుట్.. స్టార్ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. కానీ స్టార్ హీరోలెవరు పాయల్ రాజపుట్ ని దగ్గరకి రానివ్వడం లేదు. ఆఖరుకి రవితేజ, వెంకటేష్ ల పక్కన నటించినా ఈ బోల్డ్ బ్యూటికి అవకాశాలు అనుకున్నట్టుగా లేవు. అయినా తన ప్రయత్నాలు మానని పాయల్ రాజపుట్ సడన్ గా వెయిట్ లాస్ అయ్యింది. మరీ బొద్దుగా కాకపోయినా.. హైట్ కి సరిపడా వెయిట్ తో కళకళలాడే పాయల్ రాజపుట్ ఈ మధ్యన తాను సన్నబడిన ఫొటోస్ నో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫొటోస్ చూసాక పాయల్ రాజపుట్ అవకాశాల కోసం బాగా కష్టపడుతుంది. అమ్మాయి మేకోవర్ అదుర్స్. అయినా మొన్నటివరకు కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఇలా ఎలా బరువు తగ్గింది. పాయల్ రాజపుట్ బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. అయితే తాజాగా తన బరువు పై పాయల్ రాజపుట్ స్పందించింది. అది తాను నటిస్తున్న ఓ తెలుగు సినిమా కోసం ఇలా బరువు తగ్గాల్సి వచ్చింది అని.. కన్నడ రీమేక్ గా తెరకెక్కనున్న ఆ సినిమాలో పాయల్ పేదరికంలో కొట్టుమిట్టాడే పాత్ర చేస్తుందట. ఆ పాత్ర కోసమే ఇలా బరువు తగ్గాల్సి వచ్చింది అని.. అయినా తెలుగు సినిమాలు చేస్తున్నప్పటి నుండి డైట్ లో బాగా స్ట్రిక్ట్ గా ఉంది బరువు తగ్గిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News