అందులో హీరోయిన్ పాయల్ కాదంట..!

‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. [more]

Update: 2019-03-25 08:49 GMT

‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వరరావు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆ కథతోనే సినిమాను తెరకెక్కించనున్నారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కోసం

హీరోయిన్ గా సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను తీసుకుందాం అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదంట. ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు అని తెలుస్తుంది. బెల్లంకొండకు రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆ రెండు అయిపోయిన తరువాత ఈ సినిమా ఉండబోతుంది. దీనికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News