ఈ సినిమా ఓకే అయితే బంపర్ ఆఫర్ కొట్టినట్టే..!

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అటువంటి ఫీట్ చేసింది. ‘RX100’ సినిమాలో తన బోల్డ్ యాక్టింగ్, [more]

Update: 2019-02-02 06:22 GMT

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అటువంటి ఫీట్ చేసింది. ‘RX100’ సినిమాలో తన బోల్డ్ యాక్టింగ్, గ్లామర్ తో ఆడియన్స్ ను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ అయితే వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇంత గ్లామర్ షో చేసినా ఆమెకు ఆఫర్స్ మాత్రం అసలు రావడం లేదు. ‘RX100’ తరువాత ఈమెకు వరస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అతివంటిది ఏమీ జరగలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ‘డిస్కో రాజా’ సినిమా ఒక్కటే ఉంది.

 

అక్కినేని హీరోతో…

ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వీఐ ఆనంద్ తీస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్ చేసే సన్నాహాల్లో ఉన్నాడు. క్యాస్ట్ అండ్ క్రూ ఎంపికలో రాహుల్ రీసెంట్ గా హీరోయిన్ పాత్ర కోసం పాయల్ ను ఆడిషన్ చేసాడట. అంతా ఓకే అయితే త్వరలోనే నాగార్జునతో పాయల్ నటించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News