అది కూడా కలిసి రాలేదే..!

ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజపుట్.. ఆ సినిమా హిట్ తో తెగ బిజీ అవుతుంది అనుకుంటే… ఎక్కడా పాయల్ పేరు కూడా వినబడలేదు. అదిగో పాయల్ [more]

Update: 2019-05-25 07:17 GMT

ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజపుట్.. ఆ సినిమా హిట్ తో తెగ బిజీ అవుతుంది అనుకుంటే… ఎక్కడా పాయల్ పేరు కూడా వినబడలేదు. అదిగో పాయల్ ఆ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా లో నటిస్తుందని రూమర్స్ తప్ప పాయల్ రాజపుట్ కి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలు లేదు. హాట్ హీరోయిన్ కి యంగ్ హీరోలు అవకాశమివ్వకపోయినా… సీనియర్ హీరోలు పిలిచి అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే వెంకీమామలో వెంకటేష్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ కి మన్మధుడు 2లో అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ అవకాశం రకుల్ తన్నుకుపోయింది. ఇక బాలకృష్ణ సరసన పాయల్ అన్నారు కానీ కంఫర్మేషన్ లేదు.

ఆ పాట ఎందుకు ఒప్పుకుందో..?

తాజాగా పాయల్ రాజపుట్ స్పెషల్ సాంగ్ చేసిన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమాలో పాయల్ బుల్ రెడ్డి అనే స్పెషల్ సాంగ్ లో గ్లామర్ ఒలకబోస్తూ చిందులేసింది. కానీ సీత సినిమాలో ఆ సాంగ్ ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు. పాయల్ ఎందుకు ఈ సాంగ్ ఒప్పుకుందో తెలియదు. అధిక పారితోషకం ఇస్తాను అన్నారేమో అందుకే పాయల్ ఆలా టెంప్ట్ అయ్యిందిలే అని సోషల్ మీడియాలో పాయల్ పై సెటైర్స్ పడుతున్నాయి. ఏదో సీత సినిమా హిట్ అయినా బాగుండేది. కాస్తో కూస్తో పాయల్ కి పేరొచ్చేది. పాపం పాయల్ రాజపుట్. కేవలం సీనియర్ హీరోల దృష్టిలో పడుతూ స్పెషల్ సాంగ్స్ అయినా చేసుకుందామంటే అది వర్కౌట్ అవలేదు.

Tags:    

Similar News