చరణ్ కి నో... బెల్లకొండ కి సై!

Update: 2018-09-16 04:13 GMT

రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అందులో నటించిన హీరో, హీరోయిన్స్ కూడా అంతే పేరు వచ్చింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే పెద్ద విజయం సాధించింది. గ్లామర్ పరంగా.. నటన పరంగా యూత్ లో మంచి క్రేజ్ కి సంపాదించుకున్న పాయల్ తొందరపడి వచ్చిన అవకాశాలన్నిటిని ఓకే చేయట్లేదు. అందులోను అన్ని RX లాంటి పాత్రలు రావడంతో.. పాయల్ జాగ్రత్తగా సినిమాలకు సైన్ చేస్తుంది. అయితే గతంలో పాయల్ రాజ్ ఫుట్ రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి నో చెప్పిందని టాక్ నడిచింది.

ఐటెం సాంగ్ చేయడానికి......

మరి ఇప్పుడు చాలా జాగ్రతగా ఆలోచించి తన కెరీర్ ను ఒక గాడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె తెలుగులో ఓ సినిమాలో హీరోయిన్, ఇంకో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఒకపక్క సినిమాలను ఓకే చేస్తూ మరోపక్క ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిందట ఈముద్దుగుమ్మ. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ చేయనుందట. మరి అప్పట్లో రామ్ చరణ్ కి నో చెప్పి ఇప్పుడు బెల్లంకొండపై పాయల్ ఎందుకు ఎస్ చెప్పిందో కానీ... ప్రస్తుతం మెగా ఫాన్స్ అయితే ఫెయిల్ కి ఎంత పొగరు అంటూ మాట్లాడుకుంటున్నారు.

నిజమెంతో తెలియదు కాని......

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.... బెల్లంకొండ శృనివాస్ సిఎంమాలో పాయల్ రాజ్ ఫుట్ ఐటెం సాంగ్ అనే మాట మాత్రం ఫిలింసర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ కు ఆమె భారీగా అడుగుతుందని తెలుస్తుంది. అయితే ఆమె ఎంత అడిగినా ప్రొడ్యూసర్స్ ఇవ్వటానికి రెడీ అంటున్నారట. చూసారుగా ఆమె క్రేజ్ ఎలా ఉందో..అది మ్యాటర్.

Similar News