సీనియర్స్ పక్కన పాయల్..!

ఆర్‌ఎక్స్‌ 100 లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో తెలుగుతెరకు పరిచయం అయిన పాయల్‌ రాజ్‌పుట్‌ సుడి మారిపోయింది అనుకున్నారు అంతా. మొదటి సినిమాతోనే సక్సెస్ తో [more]

Update: 2019-05-15 08:39 GMT

ఆర్‌ఎక్స్‌ 100 లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో తెలుగుతెరకు పరిచయం అయిన పాయల్‌ రాజ్‌పుట్‌ సుడి మారిపోయింది అనుకున్నారు అంతా. మొదటి సినిమాతోనే సక్సెస్ తో పాటు యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న పాయల్ కు ఆర్‌ఎక్స్‌ 100 తరువాత పెద్ద అవకాశాలు రాలేదు. బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసినా యూత్‌ సినిమాలకి ఆమెని ఎవరూ సంప్రదించడం లేదు. రీసెంట్ గా వెంకీమామ సినిమాలో వెంకీకి జోడిగా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున ‘మన్మథుడు 2’లో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఆమె ప్లేస్ లో రకుల్ వచ్చి డేట్స్ ఇవ్వడంతో ఈమెకు ఆ లక్కీ ఛాన్స్ పోయింది.

ర‌వితేజ డిస్కోరాజాలోనూ

ఇప్పుడు లేటెస్ట్ గా ఫిఫ్టీ ప్లస్‌ హీరో రవితేజతో కూడా పాయల్‌ ‘డిస్కో రాజా’ చేస్తోంది. అలానే సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుంది. ఇందులో ఒక హీరోయిన్‌ రోల్‌ అయితే పాయల్‌కి బుక్ అయ్యింది. యంగ్ హీరోస్ తో చేయాల్సిన పాయల్ ఇలా సీనియర్ హీరోస్ ప‌క్క‌న చేయడం కొంచెం ఆశ్చ‌ర్యం కలిగించే విషయమే. తేజ డైరెక్షన్ లో వస్తున్న సీత అనే సినిమాలో ఐటెమ్ గ‌ర్ల్ గా మాత్రం కనిపిస్తోంది. యూత్ ఫుల్ చిత్రంతో పరిచయం అయిన పాయల్ కు యంగ్ హీరోతో చేసే ఛాన్స్ ఎందుకు రావడం లేదు అర్ధం కానీ విషయం.

Tags:    

Similar News