ఒక్క సినిమాతోనే వారిని టార్గెట్ చేసిందిగా..!

Update: 2018-07-21 07:32 GMT

గత గురువారం చిన్న సినిమాగా విడుదలై చితక్కొట్టే కలెక్షన్స్ తో యూత్ లో అదరగొట్టే ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న RX 100 సినిమా గురించి ముచ్చట్లు ఇంకా ముగియలేదు. కేవలం ఒక్క వారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 7 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8.5 కోట్లు కొల్లకొట్టింది. ఈ సినిమా లో కార్తికేయ హీరోగా అదరగొట్టగా.. హీరో కన్నా ఎక్కువగా ఈ సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ కి పేరొచ్చింది. ఆ అమ్మాయి మొదటిసారి తెలుగు తెరకి పరిచయం అవడం.. మొదటి తెలుగు సినిమా కే రెచ్చిపోయి బోల్డ్ సీన్స్ లోను నటించడం... అంతేకాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడమే కాదు.. అలాగే మొదటి సినిమానే గట్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి పేరు ఎంతగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుందో... హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ పేరు కూడా అంతే ఘనంగా వినబడుతుంది.

అవకాశాలు వస్తున్నా ఆలోచనలో పడింది...

ఇక పాయల్ రాజ్ పుట్ దశ తిరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే వరసబెట్టి అమ్మడుకి మంచి అవకాశాలే వస్తున్నాయట. కానీ అన్ని RX 100 మూవీ లో లానే వ్యాంప్ పాత్రలే రావడంతో అమ్మడు అలాంటి పాత్రలు మళ్లీమళ్లీ ఒప్పుకుంటే.. ఇక వ్యాంప్ పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందని... అందుకే ఆలోచించి అడుగులు వేస్తుందట. వచ్చిన అవకాశాలని ఒప్పుకోకుండా ఆలోచనలో పడిందట. అయితే RX 100 సక్సెస్ సాధించడంతో.. RX 100 సక్సెస్ టూర్ చేస్తున్న చిత్ర బృందంలోని పాయల్ రాజపుట్ ని మీకు ఏ హీరోలతో చెయ్యాలని ఉంది అని అడగగా... నాకు పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చెయ్యాలని ఉందని సమాధానం చెప్పి షాకిచ్చింది.

మరి వారు ఛాన్స్ ఇవ్వాలి కదా...

మరి ఒకే ఒక్క సినిమాతో ఇలా స్టార్ హీరోలను టార్గెట్ చేసిన ఈ భామ కోరిక ఎప్పటికి తీరుతుందో... మరి చిన్న సినిమాలో బోల్డ్ గా నటించిన ఈ భామకి ప్రస్తుతం మీడియం హీరోల పక్కన ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్ లాంటి వాళ్లు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోయిన్ ని తమ సినిమాలోకి ఒప్పుకోవాలి కదా. చూద్దాం పాయల్ రాజపుట్ టాలీవుడ్ ప్రస్థానం ఎలా ఉంటుందో చూద్దాం.

Similar News