మొన్న బోల్డ్.. ఇప్పుడు యాక్షన్!

Update: 2018-09-05 07:43 GMT

ఈ ఏడాది అనుకోకుండా హిట్ లిస్ట్ లోకి చేరి సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుని చిన్న సినిమాగా చితక్కొట్టే హిట్ కొట్టి సంచలనం సృష్టించిన ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు, హీరో, హీరోయిన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అజయ్ భూపతి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ బోల్డ్ కంటెంట్ చిత్రాన్ని యావత్ యూత్ ఆదరించి సూపర్ హిట్ చేసి అదరగొట్టే లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. ఇక అజయ్ భూపతికి, హీరోయిన్ పాయల్ కి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఆర్ఎక్స్ 100లో నెగటివ్ పాత్రలో బోల్డ్ గా, గ్లామర్ గా ఇందు పాత్రలో రెచ్చిపోయిన పాయల్ రాజ్ ఫుట్ కి అవకాశాలు క్యూ కట్టినప్పటికీ.. అన్ని ఆర్ఎక్స్ 100 సినిమాలోని పాత్ర లాంటి పాత్రలే రావడంతో ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది.

కావాల్సిన అవకాశం దక్కిందా..?

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో పాయల్ రాజపుట్ కి రెండో హీరోయిన్ పాత్ర వచ్చినా ఆమె నో చెప్పిందనే న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా పాయల్ రాజపుట్ కి తాను అనుకున్న పాత్ర తగిలింది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండడం... అలాగే సినిమాలో కంటెంట్ ఉన్న పాత్రలకే పాయల్ ఓకె చెప్పాలని అనుకున్నట్లుగానే ఇపుడు పాయల్ అలాంటి సినిమాకి ఓకె చెప్పిందట. భాను శంకర్ దర్శకుడిగా తెరకెక్కనున్న సినిమాకి పాయల్ రాజపుట్ ఒకే చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఆర్ఎక్స్ 100 పాత్రకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని... అలాగే ఈ సినిమాలో పాయల్ ఫైట్ సీన్స్ లో కూడా పాల్గొంటుందని చెబుతున్నారు. రెండో సినిమాని భాను శంకర్ దర్శకుడిగా చేస్తున్న పాయల్ రాజపుట్.. మూడో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. సి కళ్యాణ్ నిర్మాతగా.. తెరకెక్కనున్న సినిమాలో పాయల్ కి మంచి రోల్ వచ్చిందని... దీనికి కూడా పాయల్ రాజపుట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది. అయితే సి కళ్యాణ్ సినిమా వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News