అల్లు అర్జున్ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..!

Update: 2018-10-29 06:19 GMT

అల్లు అర్జున్ నా పేరు సూర్య వచ్చి ఆరు నెలలు గడిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేదు. అల్లు అర్జున్ రేంజ్ కి డైరెక్టర్ దొరకకనే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ ని మొదలుపెట్ట పెట్టలేదనే టాక్ ఉంది. విక్రమ్ కుమార్ చెప్పిన కథకు కనెక్ట్ కాని అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపించడం, అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో అరవింద సమేత హిట్ అయితేనే త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేసే యోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. మరి అధికారిక ప్రకటన అయితే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాకి రాలేదు కానీ.. వీరి కాంబోలో డిసెంబర్ నుండి ఒక సినిమా పట్టాలెక్కేందుకు రేడి అవుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది.

హీరోయిన్ గా పాయల్...

అయితే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన RX100 తో పేరు తెచ్చుకున్న పాయల్ రాజపుట్ నటించనుందని న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. RX100లో నెగెటివ్ పాత్రలో ఇందుగా అదరగొట్టిన పాయల్ రాజపుట్ ఆ సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాకి సైన్ చెయ్యలేదు. మరి తాజాగా అల్లు అర్జున్ సరసన ఛాన్స్ దక్కించుకుంది అని ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆ ప్రచారం నిజమే అయితే పాయల్ రాజపుట్ అదృష్టవంతురాలు. ఎందుకంటే RX100 లో అదరగొట్టే రోల్ లో మెప్పించిన అమ్మడు వైపు హీరోలెవరు కనీసం కన్నెత్తి చూడలేదు.

Similar News