పాయల్ రాజ్ పుత్ పరిస్థితేంటి..?

Update: 2018-12-10 06:21 GMT

'అర్జున్ రెడ్డి' చిత్రం జనాల్లో ఎలా ఇంపాక్ట్ తెచ్చిందో అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ కూడా తెచ్చింది. ఇందులో హీరోయిన్ గా నటించిన పాయల్‌ రాజ్‌పుత్‌ తన బోల్డ్ నెస్ గ్లామర్ తో ఇండస్ట్రీ చూపును తన వైపునకు తిప్పుకుంది. నటనతో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో వరస సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకున్నారు అంతా. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు.

కేవలం ఒక పాటకు మాత్రమే...

కానీ అందుకు భిన్నంగా ఆమెకు ఇప్పుడువరకు మెయిన్ హీరోయిన్ గా చెప్పుకో తగ్గ సినిమానే రాలేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య మహేష్ తో, అల్లు అర్జున్ తో చేసే ఛాన్స్ వచ్చిందని రకరకాలుగా వార్తలు వచ్చాయి కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ చేస్తున్న చిత్రంలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందని తెలుస్తుంది. దీంతో తెలుగులో ఒక్క సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు పాయల్ కు. మన దర్శకనిర్మాతలు ఈమెపై ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు అర్ధం కావడం లేదు.

Similar News