పాయల్ పాపం కదా?

పాయల్ రాజపుట్ కి వరస గా షాకులు పడుతూనే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ తో చేసిన RX 100 హిట్ కానీ RDX లవ్ ప్లాప్. RDX [more]

Update: 2019-12-15 06:03 GMT

పాయల్ రాజపుట్ కి వరస గా షాకులు పడుతూనే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ తో చేసిన RX 100 హిట్ కానీ RDX లవ్ ప్లాప్. RDX లవ్ అలాంటి ఇలాంటి ప్లాప్ కాదు. అమ్మడుకి దిమ్మతిరిగే ప్లాప్ ఇచ్చింది. అయినా పాయల్ రాజపుట్ కి కుర్ర హీరోలెవరు ఛాన్స్ ఇచ్చినపాపాన పోలేదు. వెంకిమామ లో సీనియర్ హీరో వెంకటేష్ సరసన, డిస్కో రాజా లో రవితేజ సరసన ఆఫర్స్ తగిలాయి. వెంకిమామలో రాశి ఖన్నా కాంపిటీషన్, డిస్కో రాజా లో నాభ నటేష్ కాంపిటీషన్. మరి సీనియర్ హీరోలంటే.. ఇప్పటినుండి ఇక పాయల్ కి యంగ్ హీరోస్ ఛాన్స్ రావడం కష్టం. అందులోని వెంకిమామ సూపర్ డూపర్ హిట్ అయితే పాయల్ కి ఏమైనా ఛాన్స్ ఉండేది. కానీ వెంకిమామ కి యావరేజ్ పడింది.

వెంకిమామ కి యావరేజ్ టాక్ పడడం అటుంచి… ఈ సినిమాలో పాయల్ రాజపుట్ కేవలం అందాల ఆరబోతకే కానీ.. నటనకు స్కోప్ లేని పాత్ర. హిందీ టీచర్ గా పాయల్ గ్లామర్ గా కనబడింది. ఓకె.. కానీ నటనకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఏ క్రిటిక్ చూసినా పాయల్ రాజపుట్ అందాల ఆరబోతకి.. వెంకటేష్ సరసన పాటల కోసమే కానీ పాయల్ హడావిడి సినిమాలో ఏం లేదనేశారు. ఒకరు పాయల్ రాజపుట్ పాత్ర ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఆమె అప్పీయరెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు అంటే మరొకరు… పాయల్ రాజపుట్ కన్నా కొద్దిగా రాశి ఖన్నా పాత్రకే ఎక్కువ ఇంపోర్టన్స్ ఉంది.. పాయల్ ఎలా ఒప్పుకుందో పాపం అంటున్నారు. మరి వెంకిమామ ఇంతపెద్ద షాకిస్తే… రేపు రవితేజ డిస్కో రాజా ఏం చేస్తుందో అనే బెంగలో పాయల్ ఉంది

Tags:    

Similar News