పాయల్ నెక్స్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తో యూత్ కి బాగా దగ్గరైన పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో [more]

Update: 2019-05-27 08:19 GMT

‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తో యూత్ కి బాగా దగ్గరైన పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన అందచందాలని పోస్ట్ చేస్తూ గ్లామర్ పరంగా యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. తన మాతృ బాషా పంజాబీ అయినా తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

రీసెంట్ గా ఐటెం సాంగ్ చేసింది. తేజ డైరెక్షన్ లో వచ్చిన సీత అనే సినిమా లో ఐటెం సాంగ్ చేసిన పాయల్ తెలుగులో ‘వెంకీమామ’ .. ‘డిస్కోరాజా’ .. ‘మన్మథుడు 2’ సినిమాలు చేస్తోంది. ఇలా వరస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న పాయల్ ఇదే మంచి సమయం అనుకుని పారితోషికం పెంచేసిందట. ఈ నేపథ్యంలో బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ సినిమా కోసం ఆమెను సంప్రదించగా, పారితోషికంగా ఆమె 75 లక్షలు అడిగిందని అంటున్నారు.

ఆమె ఒకేసారి ఇంత అడిగేపాటికి ఆ స్థాయి పారితోషికం ఆమెకి ఇవ్వాలా .. మరో కథానాయికను సంప్రదించాలా? అనే విషయంలో దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారని వినికిడి. అయితే పాయల్ కి అటు మాస్ లోను యూత్ లోను మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై అధికారం ప్రకటన రానుంది.

Tags:    

Similar News