‘సాహో’ గురించి వస్తున్నా వార్త నిజం కాదు

దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో వరల్డ్ వైడ్ గా ఆగష్టు 15వ తేదీన భారీ లెవెల్ [more]

Update: 2019-06-05 08:22 GMT

దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో వరల్డ్ వైడ్ గా ఆగష్టు 15వ తేదీన భారీ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈసినిమా కోసం ఇండియా లో ఉన్న చాలా సినీ పరిశ్రములు ఎదురు చూస్తున్నాయి.ఇక ఈమూవీలో పాయల్ రాజ్‌పుత్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందనేది గత కొన్ని రోజులు నుండి వైరల్ అవుతుంది.

వార్త విన్న చాలామంది ఈ దెబ్బతో పాయల్ స్టార్ తిరుగుతుందని అన్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని తెలిసిపోయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడిని గుర్తించిన పాయల్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయట్లేదని తేల్చి చెప్పేసింది. దాంతో ఈ రూమర్ కి చెక్ పెట్టినట్టైంది.

యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ కథానాయికగా నటిస్తుండగా పలువురు బాలీవుడ్ తారలు కీలక పాత్రలు చేస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ లో కూడా ఈ మూవీ రిలీజ్ కావడం విశేషం. త్వరలోనే ఈ మూవీ యొక్క టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Tags:    

Similar News