ఆ విషయంలో హర్ట్ అయ్యాను అంటున్న పాయల్

పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే మనకి ముందు గుర్తు వచ్చేది తన బోల్డ్ యాక్టింగ్. తన తొలి సినిమాతో యూత్ కి నిద్ర లేకుండా చేసిన [more]

Update: 2019-09-18 11:25 GMT

పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే మనకి ముందు గుర్తు వచ్చేది తన బోల్డ్ యాక్టింగ్. తన తొలి సినిమాతో యూత్ కి నిద్ర లేకుండా చేసిన ఈ హాట్ బ్యూటీ మరోసారి నిద్ర లేకుండా చేయనుంది. తన నెక్స్ట్ చిత్రం ‘RDX లవ్’ తో మరోసారి సెన్సేషన్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసినా ప్రోమోస్ చూస్తే అందులో పాయల్ మరీ ఘాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ట్రైలర్ చూస్తే సినిమాలో ఏదో కంటెంట్ ఉంది అని అర్ధం అవుతుంది. దాంతో ఈసినిమాపై అంచనాలు పెరిగాయి.

మరి నేను హర్ట్ కానా….?

తరచూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే పాయల్ కు తన నెక్స్ట్ మూవీ ‘RDX లవ్’ లో బోల్డ్ పోస్టర్లకు.. బోల్డ్ యాక్టింగ్ కు విమర్శల ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మీరు ట్రోలింగ్ గురించి ఎలా స్పందిస్తారు అంటే? అసలు అటువంటివి నేను పట్టించుకోను, కాకపోతే కొన్ని సార్లు హర్ట్ అవుతానని వెల్లడించింది. మరి మీరు ఎప్పుడైనా హర్ట్ అయినా సందర్భం ఉందా? అని అడిగితే కొన్ని రోజులు కిందట వెంకిమామ సెట్ నుంచి ఓ ఫోటో బయటకు వచ్చింది. అందులో నేను వెంకీ గారితో గౌరవం లేకుండా ప్రవర్తించానని ఒక వీడియో చేశారు.. అది వైరల్ అయింది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. నన్ను వెంకీ గారు హగ్ చేసుకునే టైములో నేను ఏదో తింటున్నా ఆ టైములో ఆయన నన్ను హగ్ చేసుకోవడం సరి కాదు అని కొంచెం దూరం నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చాను. కానీ నేనేదో తప్పు చేసినట్టు ప్రచారం చేశారు” అంటూ వాపోయింది

 

Tags:    

Similar News