పాయల్ పాపకి బంపర్ ఆఫర్ తగిలిందా?

RX 100 అంటూ మంచి హిట్ కొట్టిన పాయల్ రాజపుట్ కి మళ్ళీ అలాంటి సినిమా కానీ, అలాంటి హిట్ కానీ తగల్లేదు. RX తర్వాత అందాల [more]

Update: 2021-02-16 08:38 GMT

RX 100 అంటూ మంచి హిట్ కొట్టిన పాయల్ రాజపుట్ కి మళ్ళీ అలాంటి సినిమా కానీ, అలాంటి హిట్ కానీ తగల్లేదు. RX తర్వాత అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటనను పక్కనబెట్టేసింది. ఆఖరికి సీనియర్ హీరో వెంకటేష్ కూడా పాయల్ కెరీర్ ని కాపాడలేకపోయాడు. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలవాల్సిన పాయల్ రాజపుట్ ఇప్పటికీ గ్లామర్ గ్లామర్ అంటూ హాట్ ఫోటో షూట్స్ ని నమ్ముకుంటుంది తప్ప.. పెరఫార్మెన్సు కి చోటివ్వడం లేదు. RX తర్వాత సరైన అవగాహనా లేకుండా గ్లామర్ చూపించే పాత్రలకే సై అన్నది. కాని అవేమి పాయల్ ని బిజీ చేయలేకపోయాయి. అయితే రీసెంట్ గా పాయల్ రాజ్ ఫుట్ కి భారీ బడ్జెట్ మూవీలో సీనియర్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చినట్లుగా ఓ \ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరక్కెడుతున్న BB3 లో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆ సినిమాలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్స్ వెతుకులాటలో బోయపాటికి పాయల్ రాజ్ ఫుట్ తగిలింది అని.. ఆ సాంగ్ లో గ్లామర్ గా పాయల్ కాలు కదిపితే సాంగ్ కి క్రేజ్ వస్తుంది అని బోయపాటి అనుకుంటున్నాడట. బాలయ్య కి హీరోయిన్స్ ని సెట్ చెయ్యడంలో ఇబ్బందులు పడిన బోయపాటి కి పాయల్ BB3 ఐటెం సాంగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని దాదాపుగా పాయల్ కె బోయపాటి ఫిక్స్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో బుల్లెట్టు మీదొచ్చే బైరెడ్డి అన్నట్టుగా..  పాయల్ పాప బాలయ్య సరసన మాస్ స్టెప్స్ తో ఉర్రుతలూగించడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు.

Tags:    

Similar News