క్రిష్ చేసిన పనికి హర్ట్ అయిన పవన్?

వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ ని కలిసి క్రిష్ ఓ అద్భుతమైన పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథ చెప్పి పవన్ కళ్యాణ్ ని ఒప్పించి.. [more]

Update: 2020-11-19 17:15 GMT

వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్న పవన్ ని కలిసి క్రిష్ ఓ అద్భుతమైన పిరియాడికల్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథ చెప్పి పవన్ కళ్యాణ్ ని ఒప్పించి.. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేయించి మరీ ఓ చిన్నపాటి షెడ్యూల్ ని క్రిష్ పూర్తి చేసేసాడు. క్రిష్ కి  కథ పర్ఫెక్ట్ గా ఉంటే ఆయన మేకింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో మనం ఇంతకుముందు చూసాం. అలానే పవన్ సినిమాని క్రిష్ ఏడెనిమిది నెలల్లో చుట్టేస్తాడని పవన్ ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ కరోనా అన్నిటిని తారుమారు చేసింది. ఇక పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనడానికి టైం పట్టేలా ఉండడం.. తన సినిమా కూడా లేట్ అయ్యేలా ఉండడంతో క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ – రకుల్ ప్రీత్ ల కాంబోలో ఓ చిన్నపాటి సినిమా షూటింగ్ ని కేవలం 40 రోజుల్లోనే ఫినిష్ చేసేసాడు.

అయితే ఇప్పుడు పవన్ కి తన సినిమా పనులు పక్కన బెట్టి మరో సినిమా చేసిన క్రిష్ మీద కోపం వచ్చిందట. ఇది సిల్లీ గాసిప్పే అయిన.. అందులో కూడా నిజముంది. ఎందుకంటే పవన్ తో క్రిష్ చెయ్యబోయే సినిమా పిరియాడికల్ బ్యాగ్ డ్రాప్ ఉన్న సినిమా. ఆ సినిమా స్క్రిప్ట్ పై లోతుగా వర్క్ చెయ్యాల్సింది పోయి.. పవన్ రావడం లేదు కదా అని క్రిష్ అలా పవన్ మేనల్లుడుతో సినిమా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్రిష్ కే తెలియాలి. కానీ ఇప్పుడు క్రిష్ అలా తన సినిమా వర్క్ పక్కనబెట్టి.. మరో సినిమా చేసాడని పవన్ కి కోపం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చారిత్రాత్మక కథ గ్రౌండ్ వర్క్ చెయ్యాల్సింది పోయి ఇలా మరో సినిమా పనులతో బిజీగా ఉంటే ఎలా అని పవన్ క్రిష్ విషయంలో హార్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. 

కానీ క్రిష్ పవన్ అనుమతి లేకుండా అయితే మెగా అల్లుడు వైష్ణవ తేజ్ తో సినిమా మొదలు పెట్టే సాహసం చెయ్యడు. పవన్ ని అడిగే క్రిష్ వైష్ణవ్ సినిమా మొదలు పెట్టి పూర్తి చేసాడు. అది బహిరంగ సత్యమే. మరి పవన్ కి క్రిష్ మీద కోపం వచ్చింది, హర్ట్ అయ్యింది అనేది నిజమా? రూమరా? అనేది నెటిజెన్స్ కే తెలియాలి.

Tags:    

Similar News