పవన్ ఓ ఎనిమిది రోజులు ప్లీజ్?

పవన్ కళ్యాణ్ రెడీ నే.. ఓ ఎనిమిది రోజులేమిటి ఎన్ని రోజులైనా పవన్ సినిమాలకు కేటాయించడానికి సినిమాల్లోకి వచ్చాడు. కాకపోతే సమయం లేదు మిత్రమా అంటూ టకటకా [more]

Update: 2020-04-20 05:52 GMT

పవన్ కళ్యాణ్ రెడీ నే.. ఓ ఎనిమిది రోజులేమిటి ఎన్ని రోజులైనా పవన్ సినిమాలకు కేటాయించడానికి సినిమాల్లోకి వచ్చాడు. కాకపోతే సమయం లేదు మిత్రమా అంటూ టకటకా సినిమాలు చేసేసి రాజకీయాల్లోకి వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనకి కరోనా అడ్డుకట్ట వేసింది. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా ఆటంకం ఏర్పడింది. అయితే కరోనా లేకపోతె మే లో విడుదల కావాల్సిన వకీల్ సాబ్ కాస్త.. కరోనా లక్డౌన్ కారణంగా డేట్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. అయితే తాజాగా జూన్ నుండి థియేటర్స్ పూర్తిస్థాయిలో తెరుచుకున్నప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారో లేదో తెలియదు గనక.. వకీల్ సాబ్ ని ఆగష్టు కి దింపే ప్లాన్ లో ఉన్నాడు దిల్ రాజు.

అయితే వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ కేవలం ఎనిమిది రోజుల టైం కేటాయిస్తే.. వకీల్ సాబ్ మిగతా షూటింగ్ కూడా ఫినిష్ చేస్తాడట. పవన్ కళ్యాణ్ సీన్స్ ని కేవలం ఎనిమిది రోజుల్లో ఫినిష్ చేసి.. మిగతా నటుల సన్నివేశాలను కూడా టకటకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేసి… సినిమాని దిల్ రాజు చేతిలో పెట్టెయ్యాలనే ఆలోచనలో వేణు శ్రీరామ్ ఉన్నాడట. ఇలా రిలీజ్ డేట్ దిల్ రాజు ఇష్టం. ఆయన ఎప్పుడంటే అప్పుడే,. జూన్ లోనా? ఆగష్టు లోనా? దసరానా? అనేది దిల్ రాజు ఛాయస్ అట.

Tags:    

Similar News