పవన్ లీకెడ్ లుక్ తోనే పండగ చేసుకోండి!!

వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా లేకపోతె ఈ పాటికి ఎప్పుడో వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ [more]

Update: 2020-06-30 06:55 GMT

వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా లేకపోతె ఈ పాటికి ఎప్పుడో వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకునేవారు. లాక్ డౌన్ అడ్డం పడి…. ఓ 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది కానీ… లేదంటే థియేటర్స్ మొత్తం షేక్ చేసేవారు పవన్ ఫాన్స్. కేవలం పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తోనే పవన్ ఫాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఓ సాంగ్ మార్కెట్ లో ఇప్పటికి క్రేజీగా వినబడుతుంది. అయితే వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు బయటికొస్తుందా? ఎప్పుడెప్పుడు వకీల్ సాబ్ అప్ డేట్ ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. ఇక సినిమా లాక్ డౌన్ మూలంగా దసరా కి విడుదల చేయబోతున్నారని.. కాదు.. ఈ కరోనా అంతా ముగిసాక డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టి.. దిల్ రాజుకి అచ్చొచ్చిన సంక్రాంతికే సినిమా రిలీజ్ అంటూ చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే వకీల్ సాబ్ పై ఎలాంటి క్లారిటీ లేని టైం లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోర్టు లో వాదించే లుక్ లీక్ అవడంతో పవన్ ఫాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. వకీల్ సాబ్ లో కీలకమైన సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కోర్టులో లాయర్ గా వాదనలు వినిపిస్తూ ఎమోషనల్ గా కనబడుతున్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ లీకెడ్ పిక్ లో పవన్ లాయర్ కోటు లో వాదనలు వినిపిస్తుంటే.. పక్కనే హీరోయిన్ అంజలి కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ లాయర్ గాఎంత పవర్ ఫుల్ గా కోర్టులో వాదిస్తాడో కానీ… ప్రస్తుతం పవన్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Tags:    

Similar News