ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఎంత మంచివారు..!

Update: 2018-05-27 07:15 GMT

ఈ ఏడాది మొదట్లోనే పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను 90 కోట్లకి బయర్స్ కొంటె అందులో 60 శాతమే వారికి తిరిగి వచ్చింది. అయితే ఆ సినిమా నిర్మాత రాధా కృష్ణ ముందుకు వచ్చి న‌ష్టపోయిన బయ్యర్లుకు కొంతమేర ఏదో సెటిల్ చేశాడని వార్తలొచ్చాయి. కానీ హీరో పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం బయ్యర్లను ఆదుకునేందుకు తమ వంతుగా ఏమీ చేయలేదన్న గుసగుసలు వినిపించాయి. అయితే అది నిజం కాదంటున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. నిర్మాతతో పాటు నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి బయ్యర్ల నష్టాలు సెటిల్ చేసినట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు త్రివిక్రమ్.

మ‌న‌ల్ని న‌మ్మిన‌వాళ్లు న‌ష్ట‌పోవ‌ద్ద‌నే...

'అజ్ఞాతవాసి' సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయారు అని అర్ధం అయింది. ఈ సినిమా మొత్తంగా రూ.90 కోట్లకు కొన్నారు. రూ.60 కోట్ల దాకా వచ్చింది. రూ.30 కోట్లు సర్దాలన్నమాట, అందుకే తమ వంతుగా మేము ముగ్గురం కలిసి పాతిక కోట్ల దాకా సర్దుబాటు చేశాం. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేశాం. ఇదేదో మేము గొప్పగా చెప్పుకోవడం లేదు. మమ్మల్ని నమ్మి వారు ఎందుకు మోసపోవడం అనే విధంగా కళ్యాణ్ ఆలోచనలుంటాయి’’ అని వివరించాడు త్రివిక్రమ్. మొత్తం ఈ సినిమా నష్టాలు పై వచ్చిన ఆరోపణలకు త్రివిక్రమ్ ఇలా తెరదించారు.

Similar News