పవన్ కి సెట్ అవుతుందా?

పవన్ కళ్యాణ్ ఐదో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ – శేఖర్ చంద్ర కాంబోలో సితార ఎంటెర్టైనెర్ దసరా కానుకగా ఓ సినిమాని అనౌన్స్ [more]

Update: 2020-10-26 06:02 GMT

పవన్ కళ్యాణ్ ఐదో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ – శేఖర్ చంద్ర కాంబోలో సితార ఎంటెర్టైనెర్ దసరా కానుకగా ఓ సినిమాని అనౌన్స్ చేసింది. అయితే ఆ సినిమా మలయాళం అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ రీమేక్ అని అంటున్నారు. నిర్మాతలు పవన్ కళ్యాణ్ సూపర్ కాప్ గా నటించబోతున్నాడని హింట్ ఇవ్వడంతోనే అందరూ పవన్ కళ్యాణ్ ఆ అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ రీమేక్ చేస్తున్నాడని ఫిక్స్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ లో పోలీస్ ఆఫీసర్ అయిన బిజూ మీనన్ పాత్ర పోషిస్తున్నట్టే. అయితే బీజూ మీనన్ పోలీస్ అధికారిగా కోపం చూపించడం, తన ఉద్యోగం ఊడబీకించినవాడి పని పట్టడం…

మరి పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా, కోపస్తుడిగా సూపర్బ్ గా సెట్ అవుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తన ఈగో ని హార్ట్ చేసిన వాడిని ఇరగ్గొట్టడంలోనూ పవన్ హీరోయిజం ఎలివేట్ అవుతుంది ఓకె. అయితే బీజూ మీనన్ పాత్ర కన్నా తెలుగులో పవన్ కళ్యాణ్ పాత్రని ఇక్కడి ప్రేక్షకులు నచ్చేలా ఎలివేట్ చెయ్యాల్సి ఉంటుంది. మరి దర్శకుడు శేఖర్ చంద్ర ఇప్పటికే అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ తెలుగు స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేసాక పవన్ ఓకె చెప్పాకే సినిమాని నిర్మాతలు ఎనౌన్స్ చేసారు అంటున్నారు. అయితే శేఖర్ చంద్ర కి మరో డైరెక్టర్ అంటే పవన్ ఫ్రెండ్, సితార నిర్మాతలకు బాగా కావల్సిన త్రివిక్రమ్ హెల్ప్ చేస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది.

గతంలో పింక్ రీమేక్ ని పవన్ ని చెయ్యమని చెప్పిన త్రివిక్రమే ఇప్పుడు అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ తెలుగు స్క్రిప్ట్ విషయంలో శేఖర్ చంద్రకి సహాయం చేస్తున్నాడట. అసలు ఈ రీమేక్ చెయ్యమని చెప్పింది కూడా త్రివిక్రమే అనే టాక్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ రీమేక్ లో పవన్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తుంటే మరో హీరో గా రానా నటిస్తాడని పవన్ ఈగో ని హార్ట్ చేసే వాడిగా రానా కనిపిస్తాడని, వారి మధ్యన యాక్షన్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News