పూజకి పవన్ తగిలాడా?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని పవన్ తదుపరి దర్శకులు ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ ఫినిష్ అయితేనే కదా పవన్ కళ్యాణ్ మిగతా [more]

Update: 2020-08-25 10:59 GMT

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని పవన్ తదుపరి దర్శకులు ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ ఫినిష్ అయితేనే కదా పవన్ కళ్యాణ్ మిగతా దర్శకుల సినిమాలు కదిలేవి. అయితే ఇప్పుడు కేంద్రం షూటింగ్స్ కి అనుమతులిచ్చింది. కానీ హీరోలు కదులుతారో లేదో తెలియదు. అలాగే హీరోలంతా కదిలినా పవన్ ఏమంటాడో దర్శకుల టెంక్షన్. అదలా ఉంటె క్రిష్ కాంబోలో పవన్ చెయ్యబోయే చారిత్రాత్మక సినిమాలో హీరోయిన్ గా రకుల్ పేరు పరిశీలనలో ఉండగా.. హరీష్ శంకర్ సినిమా కోసమా పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ సెట్ అయ్యింది అంటున్నారు.

గతంలోనే హీరోయిన్ గా పూజ పేరు పరిశీలించినట్లుగా వార్తలొస్తే… తాజాగా పూజ హెగ్డే నే పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా ఫిక్స్ అంటున్నారు. ప్రస్తుతం రాధేశ్యాం సినిమాలోనూ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే మరో సినిమా చెయ్యకపోయినా అలా అకుంఠపులములో సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అయ్యిది. అసలే హరీష్ కి కాస్త సెంటిమెంట్ కూడా ఉంది. ఎలాగూ అల్లు అర్జున్ తో డీజే లో ఓ ఊపు ఊపిన పూజ హెగ్డే.. గడ్డలకొండలోను ఇరగదీసింది. అందుకే పవన్ కళ్యాణ్ పక్కన అయితే పర్ఫెక్ట్ అని భావించి పూజని సంప్రదించి.. ఓకె చేయించాడనే టాక్ ఉంది.

Tags:    

Similar News