జిమ్ చెయ్యలేక లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్న పవన్!

పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం రెండేళ్లు సినిమాలను పక్కనపెట్టాడు. దానితో బాగా బరువు పెరిగాడు. బాగా అంటే సినిమాల్లో ఉండాల్సిన బరువు కన్నా కాస్త ఎక్కువ అన్నమాట. [more]

Update: 2020-12-03 04:55 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం రెండేళ్లు సినిమాలను పక్కనపెట్టాడు. దానితో బాగా బరువు పెరిగాడు. బాగా అంటే సినిమాల్లో ఉండాల్సిన బరువు కన్నా కాస్త ఎక్కువ అన్నమాట. ఇప్పుడు  వరస సినిమాల కమిట్మెంట్స్ తో దర్శకనిర్మతలకు ఊపిరాడనివ్వడం లేదు. రాజకీయాలతో పాటుగా సినిమాలు చేస్తా.. అంటూ సినిమాల మీద సినిమాలకు కమిట్ అవుతున్నాడు పవన్. ఐదు సినిమాలు చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ కోసం మరో దర్శకుడు కూడా సినిమా చెయ్యాలనే కసితో ఉన్నాడట.  సినిమాలకోసం పవన్ కళ్యాణ్ సన్నబడాల్సి ఉంది. మరోపక్క సోషల్ మీడియాలో పవన్ బరువు పెరగడంపై కామెంట్స్ పడుతున్నాయి. కానీ పవన్ కి రాజకీయాలు, సినిమాలు, పూజలు అంటూ బిజీ షెడ్యూల్. దానితో పవన్ జిమ్ చెయ్యలేక, బరువు తగ్గించేందుకు వేరే విధానం ఎంచుకున్నాడట.

మరి సినిమాల్లో హీరోల స్లిమ్ గా కనబడేందుకు పవన్ కళ్యాణ్ బరువు తగ్గడానికి కేవలం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట. పింక్ రీమేక్ వకీల్ సాబ్ లాయర్ లుక్ కోసం పవన్ ఎలాంటి డైట్, జిమ్ చెయ్యకపోయినా..  ఆ లాయర్ లుక్ కి ఓకె కానీ, క్రిష్ అండ్ హరీష్ శంకర్ మూవీస్ కోసం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సన్నబడాలి కాబట్టే.. ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నట్టుగా చెబుతున్నప్పటికీ.. వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనబడాల్సి ఉన్న కారణంగానే పవన్ ఇలాంటి లిక్విడ్ డైట్ ఫాలో వుతున్నట్టుగా ప్రచారం  జరుగుతుంది. 

Tags:    

Similar News