పవన్ – క్రిష్ కాంబో టైటిల్.. ఇది ఫిక్స్ ?

పవన్ కళ్యాణ్ ఇంకా వకీల్ సాబ్ కి సంబందించిన 20 రోజుల షూటింగ్ పూర్తి చెయ్యాలి తర్వాత క్రిష్ సినిమాకి రెడీ అవ్వాలి. కరోనా  అంటూ ఇంట్లోనే [more]

Update: 2020-09-14 09:32 GMT

పవన్ కళ్యాణ్ ఇంకా వకీల్ సాబ్ కి సంబందించిన 20 రోజుల షూటింగ్ పూర్తి చెయ్యాలి తర్వాత క్రిష్ సినిమాకి రెడీ అవ్వాలి. కరోనా  అంటూ ఇంట్లోనే చాతుర్మాస దీక్ష, ధర్మపరిరక్షణ దీక్షలు చేస్తున్న పవన్ వకీల్ సాబ్ షూటింగ్ కి ఎప్పుడొస్తాడో అని వకీల్ సాబ్ టీం వెయిటింగ్. అయితే తాజాగా క్రిష్ – పవన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మూడు నుండి నాలుగు భాషల్లో తెరకెక్కబోతుంది అని…. పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల్లోకెల్లా క్రిష్ సినిమానే భారీ బడ్జెట్ తో కూడుకున్నది కాబట్టి.. ఈ సినిమా హిందీలో కూడా విడుదలవ్వొచ్చని అంటున్నారు. ఇక క్రిష్ – పవన్ కాంబో టైటిల్ విషయమై సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

ముందు పవన్ – క్రిష్ కాంబో మూవీ కి విరూపాక్ష టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఆ టైటిల్ చాలా రోజులుగా ప్రచారం లో ఉండగా.. తర్వాత పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని, దొంగగా పవన్ పాత్ర ఉంటుంది కాబట్టి దొంగ అనే టైటిల్ అనుకున్నారు. అయితే తాజాగా పవన్ – క్రిష్ కాంబో టైటిల్ గా ఓం శివమ్ పెట్టబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సినిమా నిర్మాతలు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారని ఫైనల్ గా ఓం శివమ్ టైటిల్ ఫిక్స్ అంటున్నారు. మరి పవన్ ఎలాగూ సినిమాల విషయం మీడియా తో స్పందించడు. ఇక క్రిష్ కానీ నిర్మాతలు కానీ ఈ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తే ఓకె.. లేదంటే ఇది ఓ గాసిప్ టైటిల్ అవడం ఖాయం.

Tags:    

Similar News