పవన్ – క్రిష్ టైటిల్ అదేనా?

పవన్కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్లినట్టుగానే అనిపిస్తుంది. దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ వచ్చేవరకు వేరే సీన్స్ ని చిత్రీకరించామని వేణు శ్రీరామ్ కి చెప్పినట్టుగా టాక్. [more]

Update: 2020-09-23 11:13 GMT

పవన్కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్లినట్టుగానే అనిపిస్తుంది. దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ వచ్చేవరకు వేరే సీన్స్ ని చిత్రీకరించామని వేణు శ్రీరామ్ కి చెప్పినట్టుగా టాక్. అయితే పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే వకీల్ సాబ్ సెట్స్ మీదకెళ్తాడని.. తడుఅప్రి క్రిష్ తో తాను చెయ్యబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. అయితే క్రిష్ – పవన్ కాంబో మూవీ జానపద కథతో తెరకెక్కుతోందని.. పవన్ ఇంతవరకు ఇలాంటి జోనర్ లో సినిమా చెయ్యలేదని.. క్రిష్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక సెట్స్ వేయించి మరీ ఈ సినీమా షూటింగ్ చేయబోతున్నాడనే ప్రచారం ఉంది. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో మూవీ టైటిల్ విషయంలో రోజుకో పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని విరూపాక్షగా చూపించబోతున్నారని, కాదు దొంగగా కనిపిస్తాడు కాబట్టి గజ దొంగ అనే టైటిల్ పెడుతున్నారని, తాజాగా ఓం శివమ్ అనే టైటిల్ కూడా ప్రచారం లోకొచ్చింది. క్రిష్ గత సినిమాల టైటిల్స్ ని పరిశీలించిన చాలామంది క్రిష్ – పవన్ మూవీకి ఓం శివమ్ అనే టైటిల్ ఫిక్స్ అన్నారు. కానీ తాజాగా క్రిష్ -పవన్ కాంబో సినిమాకి మాటలు అందిస్తున్న బుర్రా సాయి మాధవ్ ఓ ట్వీట్ చేసారు. అది అంతర్వాహిని పేరిట ఓ పేరాగ్రాఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.  అద్భుతమైన వాఖ్యలతో అంతర్వాహిని పేరిట సాయి మాధవ బుర్ర చేసిన ట్వీట్ ని క్రిష్ కూడా హైలైట్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. అంటే పవన్ – క్రిష్ మూవీ టైటిల్ అంతర్వాహిని అయ్యుండొచ్చు అందుకే అంతగా హైలెట్ చేస్తున్నారంటున్నారు.

Tags:    

Similar News