వకీల్ సాబ్ కూడా టెంప్ట్ అవుతాడా?

ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావు.. ఓపెన్ అయినా ప్రేక్షకులు రారు అని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యి నిన్నమొన్నటివరకు ఓటిటి అంటే చిరాకు పడిన వారే ఇప్పుడు [more]

Update: 2020-09-19 07:11 GMT

ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావు.. ఓపెన్ అయినా ప్రేక్షకులు రారు అని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యి నిన్నమొన్నటివరకు ఓటిటి అంటే చిరాకు పడిన వారే ఇప్పుడు ఓటిటి కి జై కొడుతున్నారు. వి, నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో, సూర్య ఆకాశమే నీ హద్దురా, బాలీవుడ్ లక్ష్మి బాంబు అన్ని థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఎదురు చూసి ఆఖరుకి ఓటిటి ఆఫర్ కి పడిపోయాయి. ఓటిటి వాళ్ళు కూడా సినిమాలకు లాభాలొచ్చే ఆఫర్స్ ఇస్తూ అందరిని టెంప్ట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి 80 నుండి 100 కోట్ల ఆఫర్ ని ఓ భారీ ఓటిటి సంస్థ ఇచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్. కానీ దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు లు పవన్ బొమ్మ వెండితెర మీదే పడాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ ఓటిటి ఇచ్చిన భారీ ఆఫర్ కి వకీల్ సాబ్ పడినా పడొచ్చు. ఎలాగూ పవన్ కళ్యాణ్ ని అడిగినా మీ ఇష్టం అంటాడు. అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిందే డబ్బు కోసం. దర్శకనిర్మాతలు ఎలా ఉంటె మనకెందుకు అన్నట్టుగా ఉంటాడు. అలాంటిది మీ సినిమాని ఓటిటికి అమ్మోచ్చా అంటే ఎందుకు కాదంటాడు. మీ ఇష్టం అనడం తప్ప. సో పవన్ నుండి ఎలాంటి ప్రెజర్ లేదు. మరి దిల్ రాజు వి కి టెంప్ట్ అయినట్టే ఇక్కడ వకీల్ సాబ్ కి టెంప్ట్ అయ్యి షూటింగ్ పూర్తయ్యాక ఓటిటి బేరానికి పడిపోతాడేమో చూడాలి.

Tags:    

Similar News