వచ్చాడో.. లేదో.. అప్పుడే బ్రేకా?

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నెల పూర్తి కాలేదు. పండగ తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సెట్స్ మీద కొచ్చాడు. వచ్చిన [more]

Update: 2020-02-10 07:32 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నెల పూర్తి కాలేదు. పండగ తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సెట్స్ మీద కొచ్చాడు. వచ్చిన దగ్గరనుండి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ చెయ్యడమే కాదు.. పింక్ రీమేక్ తో పాటుగా.. క్రిష్ సినిమాని మొదలు పెట్టి షాకిచ్చాడు. ఆ సినిమా కూడా పింక్ రీమేక్ తో పాటుగా తెరకెక్కుతుంది అని… చెప్పడం, ఈలోపు హరీష్ శంకర్ తో సినిమా ఓకె చెయ్యడం చేసిన పవన్..ఆ టు రాజకీయాల్తోనూ బిజీగా ఉంటున్నాడు. ఎన్నడూ లేని విధముగా పవన్ కళ్యాణ్ బద్దకించకుండా సినిమా షూటింగ్ తో పాటుగా… పొలిటికల్ మీటింగ్స్ కి హాజరవుతున్నాడు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నెల అవ్వకముందే… అపుడే సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలులో పర్యటించడానికి పవన్ ప్రణాళిక సిద్ధం కావడంతో.. కొన్ని రోజులు తాత్కాలికంగా పవన్ పింక్ రీమేక్ షూటింగ్ కి బ్రేక్ వేసారట. కర్నూలు పర్యటన రెండు రోజుల్లో ముగించుకుని అటునుండి ఆటే పవన్ కళ్యాణ్ అమరావతి రైతులతో భేటీ అవుతాడని.. ఈలోపు పింక్ రీమేక్ షూటింగ్ కి బ్రేక్ పడినా.. క్రిష్ మాత్రం పవన్ కి సంబంధం లేని సీన్స్ ని షూట్ చేస్తాడని తెలుస్తుంది. 15 న అమరావతిలో రైతుల తో ముఖాముఖీ తర్వాత పవన్ నేరుగా హైదరాబాద్ చేరుకొని షూటింగ్ కి డైరెక్ట్ గా హాజరవుతాడని అంటున్నారు.

Tags:    

Similar News