ఓ గంట సినిమా.. మరో గంట రాజకీయం

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న టైం లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజధానుల విషయంలో ఏపీ మొత్తం అతలాకుతలం [more]

Update: 2020-01-21 07:40 GMT

పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న టైం లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజధానుల విషయంలో ఏపీ మొత్తం అతలాకుతలం అన్న టైప్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇలాంటి టైం లోనే బిజెపి ని మంచి చేసుకోవడం, మధ్యలో సినిమాలు అంటూ పింక్ రీమేక్ షూట్ కి హాజరవడంతో జనసేన పార్టీ వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంలో పవన్ ఫ్యాన్స్ సంతృప్తిగాను లేరు. అయినా పవన్ తన పని తాను చేసుకుపోతున్నాడు. నిన్న జనవరి 20 నుండి పింక్ రీమేక్ షూట్ లో పవన్ పాల్గొంటున్నాడు.

తాజాగా పవన్ లాయర్ సాబ్ లుక్ ఒకటి లొకేషన్ నుండి బయటికొచ్చి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలకు దూరం కాకుండా ఓ గంట లేదో మరో గంట పింక్ రీమేక్ షూట్ కోసం సమయం కేటాయించి.. తర్వాత రాజకీయాల్లోకి జంప్ అవుతున్నాడు. నిన్నటికినిన్న ప్రొద్దుటే షూటింగ్, సాయంత్రం రాజధాని విషయంలో ప్రెస్ మీట్. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయంతో ఫుల్ బిజీ. మరి పింక్ రీమేక్ కూడా పవన్ కళ్యాణ్ అందుకే ఒప్పుకున్నాడేమో.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ అన్నంత పెరఫార్మెన్స్ ఈ సినిమాలో చేయడంలేదు. అలాగే తనకి ఎక్కువ పని వుండదు కనుకే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒపుకున్నాడనిపిస్తుంది. మరి దిల్ రాజు చేతిలో పడిన వారెవరైనా ఏకబిగిన షూటింగ్ చేసి సినిమా పూర్తి చెయ్యాలి. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా గనక దిల్ రాజు కూడా కామ్ అవ్వాల్సిన పరిస్థితి

Tags:    

Similar News