పవన్ వారసుడికి నటనలో శిక్షణ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితం విడిపోయారని అందరికీ తెలుసు. అయితే వారి పిల్లలు అకిరా, ఆద్య లు అందరితో అంటే [more]

Update: 2020-02-14 07:52 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితం విడిపోయారని అందరికీ తెలుసు. అయితే వారి పిల్లలు అకిరా, ఆద్య లు అందరితో అంటే మెగా కుటుంబ సభ్యులుగా కలిసిపోతారు కూడా. మెగా అభిమానులు కూడా రేణు దేశాయ్‌ను తమ వదినగానే భావిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవాను వివాహం చేసుకుని పిల్లాడిని కన్నప్పటికీ.. పవన్… రేణు కి తనకి పుట్టిన అకిరా, ఆద్యలతో ఎప్పుడూ టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన పిల్లల కోసం పవన్ విలాసవంతమైన ఓ ఇంటిని హైదరాబాద్ లోనే కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. దానితో రేణు దేశాయ్ పిల్లల్ని తీసుకుని పూణే నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ కూడా అయ్యింది.

అయితే కొంతకాలంగా పవన్ వారసుడు అకిరా సినిమాల్లోకి ప్రవేశించడంపై పలు హాగానాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అకిరాను పరిచయం చేయాలని యోచిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అకిరా హీరో గా అందంగా ఉంటాడని… మెగా అభిమానులు అకీరా సినిమాల్లోకి ప్రవేశించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. కాకపోతే, అకిరా జూనియర్ పవన్ కళ్యాణ్ కావాలని రేణు దేశాయ్ కోరుకోవడం లేదని మెగా ఫాన్స్ ఫీలయ్యారు. అయితే పవన్ అకిరా కోసం పెద్ద కలలు కంటున్నాడని…అలాగే అకీరాణి తెరపై అద్భుతమైన పద్ధతిలో ఆవిష్కరించేందుకు ప్లాన్స్ చెయ్యడమే కాకుండా… ప్రఖ్యాత సంస్థలో నటనలో శిక్షణ ఇప్పించాలని యోచిస్తున్నాడట. ఇక రేణు దేశాయ్ కూడా అకీరాకు నటనపై ఆసక్తి కలిగి ఉంటే.. అకీరాని ఆపనని చెబుతుంది.

Tags:    

Similar News