అందుకే నిర్మాతలు సలాం కొట్టేది!

పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వెళ్ళకముందు అతని క్రేజ్ భీబత్సం. అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు చాలామంది నిర్మాతలు పవన్ [more]

Update: 2020-03-01 14:32 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వెళ్ళకముందు అతని క్రేజ్ భీబత్సం. అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు చాలామంది నిర్మాతలు పవన్ కి భారీ గా అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకి బ్రేక్ తీసుకున్నాడు. సినిమాల్లో ఉన్న క్రేజ్ పవన్ కి రాజకీయాల్లో లేకపోవడంతో రాజకీయాల్లో చుక్కాని లేని నావలా పవన్ మిగిలిపోయాడు. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాల మీది నిర్మాతలు, దర్శకులు ఎగబడి నమ్మకం పెట్టుకున్నారు.

పవన్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు తెగ ఇదైపోతున్నారు. పవన్ మీది భారీ పెట్టుబడి పెట్టటమే కాదు.. పవన్ క్రేజ్ కి భారీ పారితోషకాలు ఇచ్చేస్తున్నారు. అయితే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంతగా క్రేజ్ కనబడలేదు. కానీ ప్రస్తుతం పింక్ రీమేక్ ఫస్ట్ లుక్, అండ్ సింగల్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మార్చ్ 8 న పింక్ రీమేక్ ఫస్ట్ సింగల్ రాబోతుంటే.. పవన్ పింక్ రీమేక్ హాష్ టాగ్ తో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని హోరెత్తిస్తుంటే.. పవన్ ఫస్ట్ సింగిల్ అన్ని టాప్ ట్రేండింగ్ లోకొచ్చేశాయి. పవన్ సినిమాల్లోకి గ్యాప్ ఇచ్చినా… పవన్ రేజ్ ఇసుమంత అయినా తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం. అందుకే పవన్ క్రేజ్ చూసి నిర్మాతలు సలాం కొడుతున్నది.

Tags:    

Similar News