లాయర్ సాబ్ కాస్తా

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ విషయాలు సోషల్ మీడియాలో అయితే నిమిషాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. అందుకే పింక్ రీమేక్ లీకులకు అడ్డుకట్టవెయ్యలేక మూవీ టీం తలలు [more]

Update: 2020-02-07 07:40 GMT

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ విషయాలు సోషల్ మీడియాలో అయితే నిమిషాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. అందుకే పింక్ రీమేక్ లీకులకు అడ్డుకట్టవెయ్యలేక మూవీ టీం తలలు పట్టుకుంటుంది. ఆన్ లొకేషన్ పిక్ మాత్రమే కాదు… షూటింగ్ స్పాట్ నుండి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్ కూడా లీకవడంతో.. పవన్ గుస్సా అయ్యాడనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి లాయరు సాబ్ అనే టైటిల్ బావుంటుంది అని.. పింక్ రీమేక్ లో పవన్ లుక్ చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే తాజాగా లాయర్ సాబ్ అనే టైటిల్ కన్నా ఎక్కువగా వకీల్ సాబ్ అనే టైటిల్ అయితే పింక్ రీమేక్ కథకి సెట్ అవుతుంది అని చిత్రబృందం పవన్ కొత్త సినిమాకి వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది. మరి పింక్ రీమేక్ తెలుగు టైటిల్ గా చివరికి వకీల్ సాబ్ టైటిల్ ఫిక్స్ అయ్యేలా ఉంది అని.. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ టైటిల్ కే మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. మే 15 న విడుదల డేట్ లాక్ చేసిన పింక్ రీమేక్ టైటిల్ ని ఉగాది రోజున రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News