పవన్ అది మర్చిపోయాడా?

సినిమాల్లో హీరోలుగా నిలబడాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరం. అందుకే స్టార్ హీరోలు ఫిట్నెస్ కోసం స్పెషల్ గా పేరున్న ట్రైనర్లు ని నియమించుకుని మరీ వ్యాయామాలు [more]

Update: 2020-02-12 03:54 GMT

సినిమాల్లో హీరోలుగా నిలబడాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరం. అందుకే స్టార్ హీరోలు ఫిట్నెస్ కోసం స్పెషల్ గా పేరున్న ట్రైనర్లు ని నియమించుకుని మరీ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫిట్నెస్ విషయం పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కనపెట్టినట్లుగా కనబడుతుంది వ్యవహారం. రాజకీయాల్లోకి దిగాక లుక్ విషయంలో పూర్తిగా మారిపోయిన పవన్ కళ్యాణ్ చాలా రఫ్ గా తయారయ్యాడు. ఇక ఫిట్నెస్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ బరువు పెరిగాడు. కానీ ఆ బరువుతోనే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. లాయర్ గా కనక ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ ఆ బరువు ఒకే.

కానీ క్రిష్ సినిమా కోసం కూడా పవన్ యాజిటీజ్ గా కనబడుతున్నాడు అంటే.. పవన్ ప్రత్యేకమైన మేకోవర్ లేకుండా సినిమాల్లో నటించడానికి సన్నద్దమయ్యాడా? అసలు ఫిట్నెస్ విషయంలోనూ పవన్ అలానే ఉండబోతున్నాడా? ఇక పవన్ చెయ్యబోయే సినిమాలు కమర్షియల్ కాదు కాబట్టి.. డాన్స్ లు లాంటివి ఉండవా.. ఏమిటి అంటూ పవన్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టయిల్ గా ఓ పాట, ఓ ఫైట్ వేసుకుంటే. అబ్బో దాని లెక్కే వేరు, దాని క్రేజే వేరు. అలాంటిది పవన్ కళ్యాణ్ లావుగా కనబడుతూ ఎబ్బెట్టుగా ఉంటే.. పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా? అసలు పవన్ రాజకీయాల్లో ఫెయిల్ అయినట్లే రీ ఎంట్రీ సినిమా విషయంలోనూ ఫెయిల్ అవుతాడేమో అనే డౌట్స్ కొడుతోంది మరి.

Tags:    

Similar News