పవన్ సినిమా మెగాస్టార్ చేస్తున్నాడా..?

Update: 2018-05-24 08:15 GMT

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. మరో పక్క ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు వదిలేసి రాజకీయాల వెంట పడ్డాడు. పాలిటిక్స్ లో సినిమా డైలాగ్స్ చెబుతూ జనాల్లోకి చొచ్చుకుపోతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అంటే 2019 ఎన్నికల వరకు సినిమాలను వదిలేసినట్లే. అందుకే తీసుకున్న అడ్వాన్స్ లకు కూడా లెక్క చెప్పకుండా పవన్ కళ్యాణ్ దర్శక నిర్మాతలను లైట్ తీసుకున్నాడు.

అన్నయ్యతో చేయాలన్న పవన్...

కాగా పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన ఒక సినిమాని ఇప్పుడు చిరు చెయ్యబోతున్నాడంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. కొరటాల - మెగాస్టార్ చిరు సినిమా పక్కా అంటున్నారు. అయితే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రీసెంట్ గా భరత్ అనే నేను సినిమాల హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ హీరోగా చేయాలనుకుని ఒక కథతో పవన్ ని కూడా కలిశాడట. ఆ కథ సందేశంతో కూడుకున్నది కావడం, అది కూడా 2019 ఎన్నికలకి ఆ సినిమా పనికొస్తుందని కొరటాల చెప్పగా పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయాలతో బిజీగా ఉన్నానని చెప్పాడట. అదే కథ మా అన్నయ చేస్తే బాగుంటుందని కొరటాలకు సూచించాడట. ఇక ఆ కథతో చిరుని కొరటాల కలవగా వెంటనే కథకి కనెక్ట్ అవడమే కాకుండా, గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. మరి అలా పవన్ కళ్యాణ్ - కొరటాల శివ చెయ్యాల్సిన ప్రాజెక్ట్ కాస్తా చిరంజీవి - కొరటాల శివ కాంబోగా సెట్ అయ్యిందనే టాక్ నడుస్తుంది.

Similar News