పవన్ తో పెట్టుకుంటే….

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ఒంటరిగానే స్టేజ్ మీద స్పీచ్ లిస్తాడు కానీ.. ఆయనతో పాటు మరెవ్వరిని మాట్లాడనివ్వడు.. పక్కన కూర్చోనివ్వడు. మోడీ, చంద్రబాబు లాంటోళ్ళు తప్ప పవన్ [more]

Update: 2020-01-28 06:58 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ఒంటరిగానే స్టేజ్ మీద స్పీచ్ లిస్తాడు కానీ.. ఆయనతో పాటు మరెవ్వరిని మాట్లాడనివ్వడు.. పక్కన కూర్చోనివ్వడు. మోడీ, చంద్రబాబు లాంటోళ్ళు తప్ప పవన్ పక్కన కూర్చోవడానికి ఎవరు పనికిరారు అన్నది పవన్ ఫీలింగేమో? జనసేన పార్టీ పెట్టింది మొదలు జనసేన తరుపున పవన్ తప్ప మరో స్పీచ్ వినింది లేదు. పవన్ స్టేజ్ మొత్తం తానే ఉండేలా చూసుకుంటాడు. అల ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఇక సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ తో పనిచేసే దర్శకనిర్మాతలు ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేయాలి. బాలకృష్ణ కి కోపమొస్తే.. అభిమానులనేమిటి.. ఎవ్వరికైనా దెబ్బలు పడాల్సిందే. అదే పవన్ కళ్యాణ్ కన్నెర్ర జేస్తే.. అది చాలా కష్టం. అంటే అది ఎదుటు వ్యక్తి కెరీర్ మీద పడుతుంది అనే భయం.

సినిమాల్లోకి యు టర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ 30 నుండి 35 రోజుల కాల్షీట్స్ కి ఏకంగా 50 కోట్లు పారితోషకం అందుకుంటున్నాడనే టాక్ ఉంది. అలాగే దిల్ రాజు అయితే పవన్ కోసమ్ ఏమైనా చేసేలా కనబడుతున్నాడు. అంటే పవన్ కి అటు సినిమాలు, రాజకీయాలు ముఖ్యమని తెలిసి పవన్ కోసం ప్రత్యేకంగా ఓ చార్టెడ్ ఫ్లైట్ కూడా ఎరేంజ్ చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ తో ఎంతో జాగ్రత్తగా ఉండి పని చేయించుకోవాలని డిసైడ్ అయిన దిల్ రాజు.. పవన్ సినిమా సెట్స్ లో ఉన్నంతసేపు పవన్ తోనే ఉండి అన్ని దగ్గరుండి చూసుకుని.. పొలిటికల్ ప్రెస్ మీట్స్ కోసం దగ్గరుండి ఫ్లైట్ కూడా ఎక్కిస్తున్నాడట.

మరి ఏపీ రాజకీయాల్లో ఉన్న వేడి కారణంగా పవన్ ఈ సినిమాకి ఎక్కడ ప్యాకప్ చెప్పేస్తాడో అనే టెన్షన్ లో దిల్ రాజు ఇదంతా చేస్తున్నాడట. అందులోను క్రిష్ సినిమాకి కూడా పవన్ డేట్స్ ఇవ్వడంతో.. ఇప్పుడు దిల్ రాజు ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ముందుగా తెరకెక్కించి.. తర్వాత పవన్ లేకపోయినా మ్యానేజ్ చేసుకోవచ్చని అనుకుంటున్నాడట. మరి పవన్ తో పెట్టుకున్నాక తప్పదుగా అన్నట్టుగా ఉందట దిల్ రాజు పరిస్థితి.

Tags:    

Similar News