పవన్ ని డైనమేట్ అంటున్న టాప్ రైటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఆయన ఫాన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. అంట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి [more]

Update: 2021-06-01 11:38 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఆయన ఫాన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. అంట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి కథ రాయాల్సి వస్తే.. ఎలాంటి కథ రాస్తారు అనగానే రాజమౌళి ఫాదర్, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి జవాబు చెప్పారో తెలుసా.. ఎవరూ ఊహించి ఉండరు కూడా. పవన్ కళ్యాణ్ కి కథ అక్కర్లేదట. ఆయన అందగాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫాన్స్ కి పండగే. పవన్ కళ్యాణ్ రెండు మూడు పాటల్లో హీరోయిన్స్ తో డాన్స్ లు, పాటలు పాడడం, ఆయన మ్యానరిజం, విలన్స్ ని కొట్టే ఫైట్ సీన్స్ ఉంటె చాలు.. అయన సినిమాల్లో కథ ఎవరూ పట్టించుకోరు.. అక్కడక్కడా కొన్ని సీన్స్ అల్లుకుంటూ పొతే చాలు సినిమా అయ్యిపోతుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 
పవన్ కళ్యాణ్ డైనమేట్ అంటూ గత రాత్రి ఈటీవీలో ప్రసారం అయినా అలీ తో సరదాగా ప్రోగ్రాం లో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మహేష్ బాబు కి ఎలాంటి కథ రాస్తారు అని అలీ అనగానే.. మహేష్ బాబు కి కథ అంటే.. అబ్బో.. చాలా టఫ్ జాబ్.. ఆయనకి కథ రాయాలంటే నా శత్రువు పూరి జగన్నాధ్ ని అడుగుతాను అంటూ ఫన్నీగా మాట్లాడారు విజయేంద్ర ప్రసాద్. తన కొడుకు తర్వాత తనకి పూరి జగన్నాధ్ అంటే ఇష్టమని.. ఆయనలోని స్కిల్స్ బాగా నచ్చుతాయని, ఆయన తీసే ఫైట్స్ సీన్స్ చాలా బావుంటాయని, ఆయన్ని ద్వేషిస్తాను అని, అందుకే నా ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా పూరి పిక్ ఉంటుంది అంటూ అది చూపించరాయన. 

Tags:    

Similar News