పవన్ లిస్ట్ లో జానీ మాస్టర్?

రాజకీయాలను పక్కనబెట్టకుండానే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అవకాశం ఉన్నప్పుడు సినిమా షూటింగ్, లేదంటే రాజకీయాలు. దానితో ఆయనతో సినిమాలు చెయ్యాలనే కోరికతో దర్శకనిర్మాతలు [more]

Update: 2020-12-01 10:38 GMT

రాజకీయాలను పక్కనబెట్టకుండానే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అవకాశం ఉన్నప్పుడు సినిమా షూటింగ్, లేదంటే రాజకీయాలు. దానితో ఆయనతో సినిమాలు చెయ్యాలనే కోరికతో దర్శకనిర్మాతలు పవన్ వెంట పడుతున్నారు. పవన్ కి కథ చెప్పి ఇప్పటికే నలుగురు డైరెక్టర్స్ ఆయన్ని లైన్ లో పెట్టుకున్నారు. వకీల్ సాబ్ తో కలిపి పవన్ కళ్యాణ్ అక్షరాల ఐదు సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఈ ఏడాది మొదట్లో మొదలైన వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, శేఖర్ కే చంద్ర సినిమాలను పవన్ చెయ్యాల్సి ఉండగా.. ఇక పవన్ తో సినిమాలు చేసేందుకు దర్శకులు వెంట పడుతూనే ఉన్నారు.

ఇప్పుడు పవన్ కొత్త సినిమాల డైరెక్టర్స్ లిస్ట్ లోకి ప్రముఖ కొరియోగ్రాఫేర్ జానీ మాస్టర్ చేతున్నట్టుగా మీడియా కోడై కూస్తుంది. జానీ ఎప్పటినుండో పవన్ తో సినిమా చేసి దర్శకుడిగా మారాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న టాక్. ఆ విషయంలో జానీ మాస్టర్ కి రామ్ చరణ్ హెల్ప్ కూడా ఉండబోతుంది అనే టాక్ మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ తో జానీ మాస్టర్ డైరెక్ట్ చేసే చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత గా ఉండబోతున్నాడట. పవన్ తో రామ్ చరణ్ ఓ సినిమా నిర్మిస్తాడనే టాక్ ఉంది. ఈమధ్యనే వకీల్ సాబ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ని కలిసిన జానీ మాస్టర్.. పవన్ తో కలిసి ఫొటోస్ తీయించుకుని హడావిడి కూడా చేసాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పవన్ తో సినిమా చెయ్యాలని రామ్ చరణ్ కి కథ వినిపించగా.. రామ్ చరణ్ జానీ కి హామీ ఇచ్చినట్టుగా ఫిలింసర్కిల్స్ లో వినబడుతున్న మాట,

Tags:    

Similar News