ప‌వ‌న్ సినిమా అక్క‌డ మేజిక్ చేస్తుందా?

Update: 2018-08-01 06:09 GMT

'అత్తారింటికి దారేది' సినిమా భ‌లే మేజిక్ చేసింది. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా కుటుంబ క‌థ‌గా తెర‌కెక్కిన ఆ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో మెప్పించింది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని సాధించింది. స‌గం సినిమా పైర‌సీ రూపంలో బ‌య‌టికొచ్చిన‌ప్ప‌టికీ, ఆ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చాలా రోజుల త‌ర్వాత ఆ చిత్రంపై త‌మిళ తంబీల క‌న్ను ప‌డింది. అందుకే ఈమ‌ధ్యే రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకొన్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ ఏరికోరి ఆ సినిమా రైట్స్ ప‌ట్టుకెళ్లింది. ఆ డీల్ ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మైంది. త‌మిళంలో సేమ్ మేజిక్ రిపీట‌వుతుందా అని సినీ పండితులు చ‌ర్చ‌ని లేవ‌నెత్తారు.

సినిమా రీమేక్ చేయవచ్చు...మరి మాటలు...

అత్తారింటికి దారేది కుటుంబ‌క‌థే అయినా... అందులో క‌థ కంటే కూడా త్రివిక్ర‌మ్ రైటింగ్ చేసిన మేజిక్కే ఎక్కువ‌. క‌థ‌ల్ని ప‌క్కాగా త‌ర్జుమా కావొచ్చేమో కానీ... మాట‌ల్లో మేజిక్ రిపీట్ అవ్వ‌డ‌మ‌నేది మాత్రం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ లైకా సంస్థ ఏరికోరి ఆ సినిమాని ప‌ట్టుకెళ్ల‌డం గురించి ఓ సాహ‌సంగానే ప‌రిగ‌ణిస్తున్నారు సినీ పండితులు. మ‌రి ఏ ధైర్యంతో లైకా నిర్ణ‌యం తీసుకొందో! అయితే ఇప్ప‌టికే ఈ సినిమా క‌న్న‌డ‌లో రీమేక్ అయ్యింది. సుదీప్ హీరోగా న‌టించి మంచి విజ‌యాన్నే సొంతం చేసుకొన్నారు. లైకా కూడా ఆ భ‌రోసాతోనే ఈ సినిమా రైట్స్ ప‌ట్టుకెళ్లుండొచ్చ‌ని కొంత‌మంది చెబుతున్నారు. అక్క‌డ విజ‌య్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని స‌మాచారం. అది తెలుసుకొన్న చాలామంది తెలుగు సినిమా వ‌ర్గాలు విజ‌య్ స్టైల్‌కి త్రివిక్ర‌మే తీసిన అత‌డు అయితే బాగుండేదేమో అనే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. కానీ సినిమా నిర్మాణంలో ఆరితేరిన లైకా ఏరికోరి అత్తారింటికి దారేదిని తీసుకొందంటే అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌ణాళిక‌లు ఉండొచ్చ‌న‌డంలో సందేహం లేదు.

Similar News