కుటుంబసమేతంగా చిరు ఇంటికి పవన్..!

Update: 2018-08-22 11:00 GMT

ఈ మధ్యన మెగా ఫ్యామిలీలోని లుకలుకల గురించిన వార్తలు మీడియాలో పెద్దగా వినబడడం లేదు. గతంలో మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్యన విభేదాలనుయ్యంటూ.. మీడియాలో అనేకరకాల వార్తలొచ్చాయి. నిజంగానే నాగబాబు పవన్ ని కోప్పడిన తీరు చూస్తే అందరూ అది నిజమనే ఫిక్స్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలం నుండి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. తన బాబుకి అన్న చిరు పేరు కలిసేలా పెట్టడమే కాదు... తన కొడుకుని తీసుకుని అన్న ఇంటికి వెళ్లడం దగ్గర నుండి... రామ్ చరణ్ బర్త్ డే కి ఇంటికెళ్లి మరీ విషెస్ చెప్పడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాయి. ఇక ఈ ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో బిజీగా ఉన్నపటికీ... రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసి మెచ్చుకోవడమే కాదు... ఆ సినిమా విజయోత్సవానికి హాజరై మెగా అభిమానులను ఆనందపరిచాడు.

చిరు ఇంటికి కుటుంబసమేతంగా...

ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాకి బూస్ట్ ఇచ్చాడు. నిన్నటికి నిన్న చిరు 151 మూవీ సై రా నరసింహారెడ్డి టీజర్ ని చూసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రామ్ చరణ్ చెప్పాడు. ఇక ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా... పిల్లలతో కలిసి చిరు ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపాడు. చిరుకి ఫ్లవర్ బొకే ఇచ్చి భార్య పిల్లల్తో కలిసి అన్నతో ఫోటోలకు ఫోజులిచ్చాడు.

Similar News